త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UTS App | రైల్వే యూటీఎస్ యాప్‌ను వాడుతున్నారా..? మార్చి 1 నుంచి ప‌నిచేయ‌దు.. ఎందుకంటే..?

UTS App | త‌ర‌చూ రైళ్ల‌లో అన్‌రిజ‌ర్వ్‌డ్ క్లాస్‌లో ప్ర‌యాణం చేస్తున్నారా..? అందుకు గాను యూటీఎస్ (అన్‌రిజ‌ర్వ్‌డ్ టిక్కెటింగ్ సిస్ట‌మ్‌) యాప్‌ను ఉప‌యోగిస్తున్నారా..? అయితే మీకు అల‌ర్ట్‌. ఇక‌పై ఆ యాప్ ప‌నిచేయ‌దు. మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్‌ను నిలిపివేస్తున్న‌ట్లు భార‌తీయ రైల్వే ప్ర‌క‌టించింది.

S

Business | Published On Feb 25, 2026, 12.06 pm IST

UTS App | రైల్వే యూటీఎస్ యాప్‌ను వాడుతున్నారా..? మార్చి 1 నుంచి ప‌నిచేయ‌దు.. ఎందుకంటే..?
Advertisement

UTS App | త‌ర‌చూ రైళ్ల‌లో అన్‌రిజ‌ర్వ్‌డ్ క్లాస్‌లో ప్ర‌యాణం చేస్తున్నారా..? అందుకు గాను యూటీఎస్ (అన్‌రిజ‌ర్వ్‌డ్ టిక్కెటింగ్ సిస్ట‌మ్‌) యాప్‌ను ఉప‌యోగిస్తున్నారా..? అయితే మీకు అల‌ర్ట్‌. ఇక‌పై ఆ యాప్ ప‌నిచేయ‌దు. మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్‌ను నిలిపివేస్తున్న‌ట్లు భార‌తీయ రైల్వే ప్ర‌క‌టించింది. దీనిపై ఇది వ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా ప్ర‌యాణికుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్ జారీ చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా మ‌రోమారు ఈ విష‌యాన్ని గుర్తు చేసింది. మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్ ప‌నిచేయ‌ద‌ని, ప్ర‌యాణికులు రైల్వేకు చెందిన రైల్ వ‌న్ యాప్‌ను ఉప‌యోగించాల‌ని సూచించింది. అన్‌రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల‌ను కూడా ఇక‌పై రైల్ వ‌న్ యాప్‌లోనే కొనుగోలు చేయాల‌ని చెప్పింది.

మార్చి 1 లోపు రైల్ వ‌న్ యాప్‌కు మారాలి..

రైల్ వ‌న్ యాప్‌ను భార‌తీయ రైల్వే ఇది వ‌ర‌కే లాంచ్ చేసింది. రైల్వేకు సంబంధించిన అన్ని స‌ర్వీసుల‌కు ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించాల‌న్న ఉద్దేశంతో భార‌తీయ రైల్వే గ‌తంలోనే రైల్ వ‌న్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే యూటీఎస్ యాప్‌ను మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగించారు. కానీ మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు. క‌నుక ఆ యాప్‌ను వాడుతున్న ప్ర‌యాణికులు రైల్ వ‌న్ యాప్‌కు మారాల్సి ఉంటుంది. రైల్ వ‌న్ యాప్‌ను త‌మ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్ర‌యాణానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉంటాయ‌ని రైల్వే శాఖ సూచించింది. ఇక రైల్ వ‌న్ యాప్‌లో రైల్వేల‌కు చెందిన అనేక సేవ‌ల‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొంద‌వ‌చ్చు.

డిజిట‌ల్ పేమెంట్ల‌పై 3 శాతం రాయితీ..

రైల్ వ‌న్ యాప్‌లో ప్ర‌యాణికులు అన్‌రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌డంతోపాటు రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల బుకింగ్‌, ప్లాట్ ఫామ్ టిక్కెట్ కొనుగోలు, పీఎన్ఆర్ స్థితి విచార‌ణ‌, లైవ్ ట్రెయిన్ ర‌న్నింగ్ స్టేటస్‌, కోచ్ పొజిష‌న్ వివ‌రాలు, రైలులో ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేయడం వంటి అనేక స‌దుపాయాల‌ను ఈ ఒకే యాప్‌లో అందిస్తున్నారు. క‌నుక ప్ర‌యాణికులు ఈ యాప్‌కు మారాల‌ని సూచించారు. అయితే రైల్ వ‌న్ యాప్‌లో అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ల‌ను తీసుకునే వారికి డిజిట‌ల్ పేమెంట్ల‌పై 3 శాతం డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నారు. వ‌చ్చే జూలై వ‌ర‌కు ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచారు. యాప్‌ను ప్ర‌మోట్ చేసేందుకు రైల్వే శాఖ ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. ఇక ఇప్ప‌టికే యూటీఎస్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్‌ల‌ను వాడుతున్న వారు వాటి లాగిన్ వివ‌రాలతోనూ రైల్ వ‌న్ యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చ‌ని తెలియజేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement