త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-EU Free Trade Agreement | భారత్-ఈయూ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ద్వైపాక్షిక సంబంధాల్లో నవశకం

న్యూఢిల్లీ వేదికగా భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా, గ్లోబల్ సప్లై చెయిన్ బలోపేతానికి, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సహకారానికి బాటలు వేస్తుంది.

J

Business | Published On Jan 27, 2026, 4.02 pm IST

India-EU Free Trade Agreement | భారత్-ఈయూ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ద్వైపాక్షిక సంబంధాల్లో నవశకం

సంక్షిప్త సారాంశం

భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, ఈయూ నేతలు ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమని, దీనివల్ల పెట్టుబడులు, ఉపాధి, ఆర్థిక వృద్ధి భారీగా పెరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

India-EU Free Trade Agreement | త్రినేత్ర.న్యూస్: భారత ఆర్థిక గమనాన్ని మార్చే దిశగా ఒక భారీ అడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-యూరోపియన్ యూనియన్ (India-EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA - Free Trade Agreement) మంగళవారం అధికారికంగా ఖరారైంది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్-ఈయూ (India - EU) శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో కలిసి ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని ప్రకటించారు.

భారత చరిత్రలో మైలురాయి

ఈ ఒప్పందం అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ.. "ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపొందించిన బ్లూప్రింట్" అని అభివర్ణించారు. భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమని ఆయన కొనియాడారు. ఈ డీల్ వల్ల ఈయూలో ఉంటున్న 8 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందన్నారు. జనవరి 27న జరిగిన ఈ వాణిజ్య ఒప్పందం భారత్, ఈయూలో భాగస్వామ్యంగా ఉన్న 27 దేశాల మధ్య జరగడం యాదృచ్ఛికం అయినా ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో సరికొత్త మైలురాయిగా నిలవబోతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా రెండు దేశాల మధ్య సుంకాలు తగ్గి, ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

India EU Seal Historic Free Trade Agreement A New Era in Bilateral Trade

ఒప్పందంలోని కీలక అంశాలు

ఇరుపక్షాల పెట్టుబడిదారులకు భద్రత కల్పించేలా 'ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్' కుదిరింది. సెమీకండక్టర్ సప్లై చెయిన్ బలోపేతం చేయడం, చిప్ డిజైన్, తయారీ రంగాల్లో పరస్పర సహకారం చేసుకోవడం, గ్రీన్ హైడ్రోజన్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల రక్షణ, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం లాంటి కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది.

ఆర్థిక వృద్ధికి ఊతం

ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడనుంది. అదే సమయంలో ఐటీ సర్వీసులు, ఫార్మా రంగాల్లో భారత్ మరింత బలోపేతం కానుంది.

India EU Seal Historic Free Trade Agreement A New Era in Bilateral Trade

ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటూ.. భారత్-ఈయూ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య నవశకం ప్రారంభమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

https://x.com/narendramodi/status/2016072795130892483

https://x.com/NewsAlgebraIND/status/2016063617473642945

Advertisement

తాజావార్తలు

Advertisement