Clean Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ రికార్డులు.. 2025లో గణనీయమైన వృద్ధి..
Clean Energy | భారత్ తన క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా 2025లో పలు అంశాల్లో రికార్డులను నమోదు చేసింది. శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 266.78 GW (గిగావాట్ల)కి పెరగగా, 2024 కన్నా ఇది 22.6 శాతం పెరిగిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
Clean Energy | భారత్ తన క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా 2025లో పలు అంశాల్లో రికార్డులను నమోదు చేసింది. శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 266.78 GW (గిగావాట్ల)కి పెరగగా, 2024 కన్నా ఇది 22.6 శాతం పెరిగిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. 2025లో భారత్‌లో శిలాజేతర ఇంధన సామర్థ్యం 49.12 GW పెరగ్గా, మొత్తం సామర్థ్యం 266.78 GWకి చేరుకుంది. అయితే ఇది 2024లో 217.62 GW మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంలో గణనీయమైన పెరుగుల నమోదు చేసింది. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విస్తరణ వేగంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
ఇక సౌర, పవన శక్తి విస్తరణలోనూ 2025లో భారత్ ఘనమైన వృద్ధిని సాధించింది. 2024లో సౌర విద్యుత్ సామర్థ్యం 97.86 GW ఉండగా, 2025లో అది 135.81 GWకి పెరిగింది. ఈ క్రమంలోనే ఈ రంగంలో 38.8 శాతం వృద్ధి చోటు చేసుకుంది. అలాగే పవనశక్తిలోనూ స్థిరమైన వృద్ధి నమోదైంది. స్థాపిత సామర్థ్యం 48.16 GW నుండి 54.51 GWకి పెరగగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 13.2 శాతం పెరుగుల నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలోనే ఇతర పునరుత్పాదక ఇంధన విభాగాలు కూడా ఈ మొత్తం వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయని అర్థమవుతోంది. బయోఎనర్జీ సామర్థ్యం 2025లో 11.61 GWకి చేరగా ఇందులో వ్యర్థాల నుండి శక్తికి మార్చే ఆఫ్-గ్రిడ్ ప్రాజెక్టుల నుండి 0.55 GW ఉంది, ఇది స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, స్థిరమైన వ్యర్థాల నిర్వహణలో పురోగతిని సూచిస్తోంది. కాగా చిన్న జల విద్యుత్ సామర్థ్యం 5.16 GWకి పెరగ్గా, పెద్ద జల విద్యుత్ సామర్థ్యం 50.91 GWగా ఉంది.
ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ 2025లో ఈ రంగంలో రికార్డు స్థాయిలో వృద్ధి సాధించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తీసుకుంటున్న, అమలు చేస్తున్న నిర్ణయాలు, విధానాల వల్లే సుస్థిర అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. దేశంలో ఇంధన భద్రతను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అదే సమయంలో పర్యావరణం పట్ల బాధ్యతను కూడా కలిగి ఉన్నామని అన్నారు. హరిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని అన్నారు. దీని వల్ల భారత్ నిబద్ధత ప్రపంచానికి తెలుస్తుందన్నారు. అలాగే దేశ పురోగతికి ఇది మేలు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా 2030 నాటికి 500 GW శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విస్తరణను మరింత వేగవంతం చేస్తున్నామని, ఇందుకు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, వాటాదారులతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
జూన్ 9, 2026

Pralhad Joshi | పెంపు అనివార్యం.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
జూన్ 8, 2026

CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..

TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు



