Income Tax Return | ట్యాక్స్ రిటర్న్‌కు చివరి గడువు నేడే.. ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు
Income Tax Return | అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం వెల్లడించింది. జూలై 30న ఒక్కరోజే 42 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు తెలిపింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026--7కు సంబంధించి ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-2 దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.
Income Tax Return | అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం వెల్లడించింది. జూలై 30న ఒక్కరోజే 42 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు తెలిపింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026--7కు సంబంధించి ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-2 దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఐటీఆర్-1 (సహజ్) చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారుల కోసం రూపొందించిన సరళమైన రిటర్న్ ఫామ్. సంవత్సరానికి రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగి, జీతభత్యాల ద్వారా ఆదాయం పొందే వారు, ఒకే ఇంటి ఆస్తి నుంచి ఆదాయం కలిగిన వారు, అలాగే సంవత్సరానికి రూ.5వేల వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న రెసిడెంట్ వ్యక్తులు ఈ ఫామ్‌ను దాఖలు చేయవచ్చు.
ఐటీఆర్-2ను వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభాలు పొందని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) దాఖలు చేస్తారు. అయితే క్యాపిటల్ గెయిన్స్ వంటి ఆదాయం ఉన్న వారికి ఈ ఫామ్ వర్తిస్తుంది. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ తన ఎక్స్ ఖాతాలో వివరాలను వెల్లడించింది.
ఇంకా 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, అందులో జూలై 30న ఒక్కరోజే 42 లక్షలకు పైగా రిటర్నులు వచ్చాయని తెలిపింది. ప్రశాంతంగా, ఆలస్యం చేయకుండా వెంటనే ఐటీఆర్ ను దాఖలు చేయాలని సూచించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
- ●CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం
- ●No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?
- ●Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..
- ●Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్
- ●VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం

MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం

CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం

No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?

Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..






