IT Refunds | ఐటీ రీఫండ్స్ హోల్డ్ అయినట్లు మెసేజ్ వచ్చిందా.. అయితే ఇలా చేయాల్సిందే..!
IT Refunds | దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన చాలా మందికి ఈసారి రీఫండ్స్ రావడం చాలా ఆలస్యం అవుతుందన్న విషయం తెలిసిందే. కేవలం కొంత మందికి మాత్రమే నిర్దేశించిన తేదీలోగా రీఫండ్స్ ఇచ్చారు. కానీ చాలా మందికి రీఫండ్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
IT Refunds | దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన చాలా మందికి ఈసారి రీఫండ్స్ రావడం చాలా ఆలస్యం అవుతుందన్న విషయం తెలిసిందే. కేవలం కొంత మందికి మాత్రమే నిర్దేశించిన తేదీలోగా రీఫండ్స్ ఇచ్చారు. కానీ చాలా మందికి రీఫండ్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన పౌరులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖకు కంప్లెయింట్లు ఇవ్వడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై ఎట్టకేలకు ఆదాయపు పన్ను శాఖ స్పష్టతను ఇచ్చింది. దేశవ్యాప్తంగా చాలా మంది ఈసారి దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో అనేక అవకతవకలు ఉన్నాయని, అనర్హులు చాలా మంది రీఫండ్ కోసం రిటర్న్స్ దాఖలు చేశారని, కనుక అన్ని రిటర్న్స్ ను పూర్తిగా తనిఖీ చేసి అర్హులైన వారికి రీఫండ్స్ ఇవ్వడం కాస్త ఆలస్యం అవుతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
డిసెంబర్ 31 వరకు గడువు..
అయితే ఐటీ రిటర్న్స్‌లో భాగంగా చాలా మంది పాల్పడ్డ అవకతవకలను గుర్తించేందుకు గాను ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నడ్జ్ క్యాంపెయిన్ చేపట్టింది. ఇందులో ఐటీ రిటర్న్స్‌లో పొరపాట్లు, తప్పులు, అవకతవకలు ఉన్నవారికి ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్‌ను పంపిస్తున్నారు. వారు డిసెంబర్ 31వ తేదీ లోగా తమ రిటర్న్స్ ను మళ్లీ పరిశీలించి ఇంకోసారి రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వారి రిటర్న్స్ ను పరిశీలించి వారు అర్హులు అయితే రీఫండ్ ఇస్తారు. అయితే ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఎస్ఎంఎస్ లేదా మెయిల్ రాని వారికి త్వరలోనే రీఫండ్స్ వస్తాయని స్పష్టం చేశారు. వారు ఏమీ చేయాల్సిన పనిలేదని కూడా తెలిపారు.

అనర్హులే ఎక్కువట..
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా అధిక శాతం మంది దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో చాలా వరకు పొరపాట్లు ఉన్నాయని, కొందరు అనర్హులు కూడా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అందుకనే చాలా వరకు రీఫండ్స్‌ను ఇప్పటి వరకు ఆపి ఉంచామని ఐటీ శాఖ తెలియజేసింది. రూ.50వేలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో రీఫండ్ కలిగిన ఐటీ రిటర్న్స్ ను తాము పూర్తిగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే నడ్జ్ క్యాంపెయిన్‌లో భాగంగా చాలా మంది పౌరులకు డిసెంబర్ నుంచే ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో గడువు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఈ నెల రోజుల్లో తాము రిటర్న్స్ ను అప్‌డేట్ ఎలా చేస్తామని, వాటిని అంత తక్కువ వ్యవధిలో మళ్లీ ఎలా దాఖలు చేస్తామని చాలా మంది పౌరులు ప్రశ్నిస్తున్నారు. కనుక గడువును మరో నెల రోజుల వరకు.. అంటే జనవరి 31వ తేదీ వరకు పెంచాలని వారు కోరుతున్నారు.
మరో నెల వరకు పొడిగిస్తారా..?
అయితే అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేసేందుకు గరిష్టంగా 48 నెలల వరకు సమయం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలుకు నిర్దేశించిన గడువు పూర్తయిన తరువాత నుంచి గరిష్టంగా 48 నెలల లోపు అప్‌డేటెడ్ రిటర్న్స్ ను దాఖలు చేయవచ్చు. అయితే అందకు గాను 70 శాతం పన్నును అదనంగా చెల్లించాలి. అదే అప్ డేటెడ్ రిటర్న్స్ ను 36 నెలల లోపు దాఖలు చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాలి. ఈ క్రమంలో అనవసరంగా తమపై భారం పడుతుందని కనుక గడువును మరో నెల రోజుల వరకు పెంచాలని చాలా మంది పౌరులు కోరుతున్నారు. అయితే దీనిపై ఆదాయపు పన్ను శాఖ ఈ విషయంపై స్పందిస్తుందా.. లేదా.. అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
సంబంధిత వార్తలు

Income Tax Department | మీ సేవింగ్స్ అకౌంట్‌పై ‘ఐటీ’ కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
మే 21, 2026

ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీస్ విడుదల..
మే 15, 2026

Income Tax Returns | ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కోసం పాత లేదా కొత్త విధానం.. ఏది ఉత్తమం..?
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



