Sampath Kumar | సంపత్…టిక్ పెడితేనే ఉద్యోగం
Sampath Kumar | మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ (Sampath Kumar) ఓ వసూలు రాజాగా మారారని ఆలంపూర్ ఎమ్మెల్యే (MLA) విజయుడు (Vijayudu) ఆరోపించారు. వసూల్ రాజాపై అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే సంపత్ అక్రమాలపై
వాస్తవాలు బయటపెట్టిన
ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ ఎస్ నేత క్రిశాంక్
అన్ని ఆధారాలు త్వరలోనే వెల్లడిస్తానని స్పష్టీకరణ
సొమ్ములిస్తేనే పనులు జరుగుతాయని బెదిరిస్తున్నారని ఆరోపణ
Sampath Kumar | త్రినేత్ర.న్యూస్: మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ (Sampath Kumar) ఓ వసూలు రాజాగా మారారని ఆలంపూర్ ఎమ్మెల్యే (MLA) విజయుడు (Vijayudu) ఆరోపించారు. వసూల్ రాజాపై అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, ప్రజలను పీడించే పాలన జరుగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయుడు మాట్లాడుతూ జిల్లాలో నేషనల్ హైవే 44 పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను సంపత్‌కుమార్ బెదిరించి, రూ.ఎనిమిది కోట్ల సొమ్ము డిమాండ్ చేశారని ఆరోపించారు. ఆ డబ్బు ఇస్తేనే పనులు జరుగుతాయని తేల్చి చెప్పారని విమర్శించారు. మరో వైపు మండల స్థాయి అధికారులను సైతం నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డ సంపత్ రాజ్యం కాదని, అది ప్రజలదని నొక్కి చెప్పారు.
తక్షణమే సిట్ ఏర్పాటు చేయాలి: మన్నె క్రిశాంక్
మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై తక్షణమే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కార్పొరేషన్ మాజీ చైర్మెన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 40 వేల ఓట్లతో సంపత్ ఓడిపోయాడని అన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంపత్‌కుమార్ తనను ముట్టుకుంటే అగ్గి అవుతారని అంటున్నాడని, కానీ అగ్గి కాకుండా మట్టి అవుతారని చెప్పారు. ఎందుకంటే ఆయన చేసే అక్రమ దందా మట్టి దందానేనని వివరించారు. ఆయన జాతీయ కాంగ్రెస్ నాయకుడని అన్న క్రిశాంక్.. ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జర్నలిస్టుల మీద సిట్ వేసిన ప్రభుత్వం ఇతని మీద సిట్ విచారణ చేస్తారా చెప్పాలన్నారు.
మారణాయుధాలతో బెదిరించారని శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఫిర్యాదు చేసిందని క్రిశాంక్ గుర్తు చేశారు. శనివారం ఆ ప్రాంతంలో పర్యటన వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సిట్ ఏర్పాటును అక్కడే ప్రకటించాలని కోరారు. సంపత్ సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని, ఎన్నికల సమయంలో తన అఫిడవిట్‌లో ఎలాంటి భూములు లేవని పేర్కొన్నారని చెప్పారు. మరి ఇప్పుడు ఆమె పేరుపై రెండెకరాల అసైన్డ్ భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఏ పని జరిగినా టెండర్లు సంపత్‌కుమార్ కుటుంబసభ్యలకు మాత్రమే రావాలన్నట్లుగా పాలన సాగుతోందని మండిపడ్డారు. సంపత్‌కుమార్ కొడుకు కంపెనీ తరపు ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవినీతిపై ఎమ్మెల్యే విజయుడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సిట్ వేయాలని కోరారు.
సంపత్‌కుమార్‌కు ప్రతిదీ దందానే: కిశోర్
ఆలంపూర్ తాలుకాలో ప్రతిదీ సంపత్‌కుమార్‌కు దందాగా మారిందని నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. నడిగడ్డ తన ఇలాకా అని సంపత్ అంటున్నాడని చెప్పారు. నడిగడ్డ సంపత్‌ది కాదని, ఆయనను రెండు సార్లు ఓడగొట్టిన ప్రజలది నడిగడ్డ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో మట్టికి దందానే, ఇసుకకు దందానే, ఇలా ఏది చూసినా దందాగానే ఉందని వాపోయారు. కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకపోతే వారి పనులు ముందుకు సాగవని ఆరోపించారు. మండల స్థాయి అధికారులు నియోజకవర్గానికి రావాలంటే సుంకం కట్టి రావాలని వివరించారు. ఆయనకు నచ్చకపోతే, సుంకం కట్టకపోతే బదిలీ సిద్ధంగా ఉంటుందని, సుంకం కడితే మళ్లీ పోస్టింగ్ దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పదవి ఉన్నదని ఈ విధంగా ప్రజలను పీడించుకుంటున్నావని ప్రశ్నించారు. ఒక్కప్పుడు సంపత్‌కు ఉన్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సంపత్‌కుమార్ బినామీల పేర్ల మీద ఎక్కడ చూసినా భూ కబ్జాలు నడుస్తున్నాయని చెప్పారు. ప్రజలే ఆయనను నడిగడ్డ నుంచి బహిష్కరణ చేసే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



