Reliance Jio | రిలయన్స్ జియో సరికొత్త నెలవారి ప్లాన్.. ఉచితంగా Gemini Pro ..
Reliance Jio | ప్రైవేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ సరికొత్త నెలవారి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.450కు ఓ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ నెలవారి ప్లాన్లు సహజంగానే 25 నుంచి 28 రోజుల వాలిడిటీని కలిగి ఉంటాయి. కానీ ఈ కొత్త ప్లాన్‌కు మాత్రం మరో వారం రోజుల అదనపు వాలిడిటీని అందిస్తుండడం విశేషం.
Technology | Published On Jan 16, 2026, 1.28 pm IST
Reliance Jio | ప్రైవేటు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ సరికొత్త నెలవారి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.450కు ఓ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ నెలవారి ప్లాన్లు సహజంగానే 25 నుంచి 28 రోజుల వాలిడిటీని కలిగి ఉంటాయి. కానీ ఈ కొత్త ప్లాన్‌కు మాత్రం మరో వారం రోజుల అదనపు వాలిడిటీని అందిస్తుండడం విశేషం. రూ.450 ప్రీపెయిడ్ ప్లాన్‌కు గాను జియో ఏకంగా 36 రోజుల వాలిడిటీని అందిస్తోంది. అంటే వినియోగదారులకు సాధారణ నెలవారి ప్లాన్‌తో పోలిస్తే మరో వారం రోజుల వాలిడిటీ అదనంగా వస్తుందని అర్థం అవుతుంది. ఇక ఇందులో అన్ని ప్లాన్లలాగే అనేక ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు.
అన్‌లిమిటెడ్ 5జి..
ఈ కొత్త ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. వాయిస్ కాలింగ్‌తోపాటు ఇంటర్నెట్ డేటాను కూడా పొందవచ్చు. అలాగే ఇతర జియో సేవలను కూడా అందిస్తున్నారు. ఈ ప్లాన్ ఇప్పటికే మై జియో యాప్‌లో అందుబాటులో ఉంది. అలాగే జియో వెబ్ సైట్ ద్వారా కూడా దీన్ని రీచార్జి చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులోనే అనేక సదుపాయాలను వినియోగదారులు పొందేలా ఈ ప్లాన్‌ను రూపొందించారు. రూ.450 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఒక వేళ 5జి ఫోన్‌ను వాడేవారు అయితే 5జి నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో అన్‌లిమిటెడ్ 5జి డేటాను పొందవచ్చు.
ఫ్రీగా Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్..
ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అన్ని నెట్ వర్క్‌లకు చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 3 నెలల కాలవ్యవధి గల జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీన్ని యూజర్లు మొబైల్ లేదా టీవీ ఎందులో అయినా వీక్షించవచ్చు. ఇక కొత్త వినియోగదారులు అయితే 2 నెలల జియో హోమ్ ట్రయల్ లభిస్తుంది. అలాగే 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను ఇస్తున్నారు. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైంది.. ఈ ప్లాన్‌తోపాటు 18 నెలల Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా ఈ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే 18 నెలల కాలానికి రూ.35వేలు అవుతుంది. కానీ రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఈ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగానే పొందవచ్చు. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న అనంతరం జియో యాప్‌లోకి వెళ్లి హోమ్ పేజీలో చూస్తే Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్ ను క్లెయిమ్ చేసుకోవాలని ఒక బ్యానర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అందులో సూచించిన విధంగా స్టెప్స్‌ను ఫాలో అయితే చాలు, ఈ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ రీచార్జి ప్లాన్‌లో ఈ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తుండడం దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






