త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Loan | బంగారంపై రుణం.. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆదుకునే ఆర్థిక వ‌న‌రు..

Gold Loan | మీ వ‌ద్ద బంగారం ఉందా..? ఇంట్లో దాన్ని అలాగే పెట్టి ఉంచుతున్నారా..? అయితే బంగారాన్ని అలా ఇంట్లో ఊరికే ఉంచితే మీకు ఏమీ రాదు. దాంతో ఏదైనా బిజినెస్ చేయండి. అవును, ఇప్పుడు చాలా మంది ఇదే మార్గాన్ని అనుస‌రిస్తున్నారు. ఇంట్లో ఉన్న బంగారం ఇప్పుడు చాలా మందికి కేవ‌లం ఆభ‌ర‌ణంగానే కాకుండా అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆదుకునే ఆర్థిక వ‌న‌రుగా కూడా మారుతోంది.

S

Business | Published On Jan 14, 2026, 9.27 am IST

Gold Loan | బంగారంపై రుణం.. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆదుకునే ఆర్థిక వ‌న‌రు..
Advertisement

Gold Loan | మీ వ‌ద్ద బంగారం ఉందా..? ఇంట్లో దాన్ని అలాగే పెట్టి ఉంచుతున్నారా..? అయితే బంగారాన్ని అలా ఇంట్లో ఊరికే ఉంచితే మీకు ఏమీ రాదు. దాంతో ఏదైనా బిజినెస్ చేయండి. అవును, ఇప్పుడు చాలా మంది ఇదే మార్గాన్ని అనుస‌రిస్తున్నారు. ఇంట్లో ఉన్న బంగారం ఇప్పుడు చాలా మందికి కేవ‌లం ఆభ‌ర‌ణంగానే కాకుండా అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆదుకునే ఆర్థిక వ‌న‌రుగా కూడా మారుతోంది. చాలా మంది బంగారాన్ని తాక‌ట్టు పెట్టి లోన్లు పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే చిరు వ్యాపారులు సైతం బంగారాన్ని అమ్మ‌కుండానే దానిపై లోన్ తీసుకుని నిధులు స‌మ‌కూర్చుకుంటున్నారు. దీంతో బంగారంపై రుణాలు చాలా సుర‌క్షిత‌మైన‌విగా, త‌క్కువ వ‌డ్డీ రేటుతో కూడిన రుణ స‌దుపాయంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఇటు ప్ర‌జ‌ల‌తోపాటు అటు వ్యాపారుల‌కు కూడా బంగారం లోన్లు అద్భుత‌మైన వ‌న‌రుగా మారాయి.

బంగారానికి పూర్తి ర‌క్ష‌ణ‌..

బంగారంపై రుణం పొంద‌డం చాలా తేలిక‌. ఇందుకు గాను చాలా త‌క్కువ ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయి. కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే రుణం మొత్తం రుణ‌గ్ర‌హీత బ్యాంకు ఖాతాలో జ‌మ అవుతుంది. రుణ గ్ర‌హీత‌లు ఆర్థిక సంస్థ‌లు లేదా బ్యాంకుల్లో త‌మ బంగారాన్ని తాక‌ట్టు పెట్టి చాలా సుల‌భంగా రుణం తీసుకోవచ్చు. ఈ క్ర‌మంలో రుణ గ్ర‌హీత తాక‌ట్టుపెట్టే బంగారాన్ని వారు త‌మ వ‌ద్ద వాల్ట్‌లో సుర‌క్షితంగా ఉంచుతారు. అందువ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఎలాంటి చింత ఉండ‌దు. ఆ బంగారానికి వారే జ‌వాబుదారిగా ఉంటారు కాబ‌ట్టి రుణ గ్ర‌హీతలు నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చు. ఇక రుణం పూర్తిగా చెల్లించిన అనంత‌రం వారు బంగారాన్ని మ‌న‌కు తిరిగి అందజేస్తారు. ఈ క్ర‌మంలో రుణ‌గ్ర‌హీత‌కు చెందిన బంగారం ఎలాంటి న‌ష్టానికి గురైనా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. అయితే ఇలా చాలా అరుదుగా జ‌రుగుతుంది.

వ‌డ్డీ రేట్లు చాలా తక్కువ‌..

వాస్త‌వానికి బంగారంపై రుణాలు పొంద‌డం వ‌ల్ల కుటుంబాల‌కు, చిరు వ్యాపారుల‌కు ఎలాంటి ఆస్తుల‌ను అమ్మాల్సిన పని ఉండ‌దు. త‌క్ష‌ణ ఆర్థిక వ‌న‌రుగా ఎంత‌గానో ఈ రుణం స‌హాయ ప‌డుతుంది. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో ఆదుకుంటుంది. పైగా ఇత‌ర రుణాలతో పోలిస్తే బంగారంపై సంస్థ‌లు వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్లే చాలా త‌క్కువ‌గా ఉంటాయి. దీన్ని ఈ లోన్ల‌లో ఉన్న ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌వ‌చ్చు. సెక్యూర్డ్ లోన్ క‌నుక బంగారంపై రుణం ఇస్తే సంస్థ‌లు చాలా త‌క్కువ‌గా వ‌డ్డీ రేట్ల‌ను తీసుకుంటాయి. ఇక బ్యాంకుల్లో, అందులోనూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన బ్యాంకుల్లో బంగారాన్ని పెడితే ఇంకా చాలా త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం ఇస్తారు. అందువ‌ల్ల బంగారం లోన్లు వినియోగ‌దారుల‌ను ఆకర్షిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే కోవిడ్ అనంత‌రం ప్ర‌జ‌లు బంగారంపై అధిక మొత్తంలో రుణాల‌ను పొందుతున్నార‌ని కూడా ఆర్‌బీఐ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఏ అవ‌స‌రం కోసం అయినా..

గోల్డ్ లోన్ తీసుకుంటే రుణ గ్ర‌హీతలు ఆ రుణాన్ని ఏ అవ‌స‌రం కోసం అయినా స‌రే ఉప‌యోగించుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు చ‌దువుల‌కు, యువ‌తులు ఉంటే వారి వివాహాల‌కు, కుటుంబ అవ‌స‌రాల‌కు, ఇంటి నిర్మాణం లేదా మ‌ర‌మ్మ‌త్తుల‌కు, త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు, వైద్య ఖ‌ర్చుల‌కు ఆ లోన్ ప‌నిచేస్తుంది. బంగారంపై లోన్ తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల దీర్ఘ‌కాలిక పొదుపుల‌కు లేదా పెట్టుబ‌డుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఆ సొమ్మును తాక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక బంగారంపై రుణం పొందితే చిరు వ్యాపారులు లేదా స్వ‌యం ఉపాధి పొందే వారికి కూడా ఎంతో ఉప‌యోగంగా ఉంటుంది. వారికి వ్యాపార అవ‌స‌రాల్లో న‌గ‌దు ల‌భ్య‌త‌కు కొర‌త లేకుండా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నిరాంట‌కంగా కొన‌సాగుతాయి. దీంతో వ్యాపారానికి ఎలాంటి అంత‌రాయం ఉండ‌దు. చిరు వ్యాపారుల‌కు కావ‌ల్సిన వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌ను అందించేందుకు బంగారం రుణాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి.

వేగంగా విస్త‌రిస్తున్న మార్కెట్‌..

చిరు వ్యాపారులు గోల్డ్ లోన్‌ను త‌మ వ్యాపారంలో భాగంగా త‌క్ష‌ణ వ్యాపార అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవచ్చు. ముడి స‌రుకుల కొనుగోలుకు లేదా వ్యాపార విస్త‌ర‌ణ‌కు కూడా ఆ లోన్ మొత్తం ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో బంగారంపై రుణం తీసుకుంటే చాలా త‌క్కువ ప‌త్రాలను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అలాగే వేగంగా రుణాన్ని మంజూరు చేస్తారు. సుల‌భంగా రుణాన్ని చెల్లించ‌వ‌చ్చు. ఇలా అన్ని ర‌కాల స‌దుపాయాలు ఉన్నాయి కాబ‌ట్టే ప్ర‌స్తుతం దేశంలో బంగారంపై రుణాల‌ను అందించే మార్కెట్ వేగంగా విస్త‌రిస్తోంది. బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ పెరుగుతుండ‌డం కూడా రుణాలు అధికంగా తీసుకునేందుకు కార‌ణం అవుతున్నాయి. దీంతో బంగారంపై రుణాల‌ను ఇచ్చే వారికి వ్యాపార అవ‌కాశాలు విస్తృతంగా ఏర్ప‌డుతున్నాయి. అలాగే ప్ర‌జ‌ల‌కు కూడా త‌మ వ‌ద్ద ఉన్న బంగారానికి ఎప్ప‌టిక‌ప్పుడు అధిక మొత్తంలో రుణం ల‌భిస్తుండ‌డం వారి అవ‌స‌రాల‌ను తీరుస్తోంది. అయితే రుణ ప్ర‌క్రియ పూర్తిగా డిజిట‌ల్ అవ‌డం కూడా ఇందుకు దోహ‌దం చేస్తోంది.

స‌కాలంలో చెల్లించాల్సిందే..

ఇక గోల్డ్ లోన్‌ల‌కు గాను వినియోగ‌దారులు స‌కాలంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ప్ర‌భావం సిబిల్‌పై కూడా ప‌డుతుంది. క‌నుక భ‌విష్య‌త్తులో ఇత‌ర మార్గాల్లో లోన్ల‌ను పొందాల‌ని అనుకుంటే క్రెడిట్ హిస్ట‌రీ, సిబిల్ ను మెరుగుప‌రుచుకోవ‌డం కోసం క‌చ్చితంగా బంగారం రుణాల‌ను స‌కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఎలాంటి లోన్ తీసుకోవ‌డంలో అయినా స‌రే ఇబ్బందులే వ‌స్తాయి. ఇక ప్ర‌స్తుతం బంగారం కేవ‌లం ఆభ‌ర‌ణంగానే కాకుండా ఒక వ్యూహాత్మ‌క ఆర్థిక ఆస్తిగా కూడా మారిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement