Talasani Srinivas Yadav | ఇంటికొకరు ర్యాలీకి తరలిరావాలి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటంలో భాగంగానే శాంతిర్యాలీ నిర్వహిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. ఇంటికొకరు చొప్పున ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ అస్తిత్వం కోసమే పోరాటం, ర్యాలీ జరుగుతుందని స్పష్టీకరణ
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటంలో భాగంగానే శాంతిర్యాలీ నిర్వహిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) నుంచి ఎంజీ రోడ్ (MG Road) లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ నివాసితులు ఇంటికొకరు చొప్పున ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని చెప్పారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్‌లో ఇమిడి ఉన్నాయన్నారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కమిషనరేట్‌లు అక్రమంగా కలిపారని మండిపడ్డారు. వాటిని ఎందుకు కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో అన్ని రంగాలకు చెందిన సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇదే మంచి సమయమని చెప్పారు. ర్యాలీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఆ హామీలు అమలు చేయకుండా పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. లష్కర్ జిల్లా సాధన సమితి పేరుతో రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఇది శాంతియుత ర్యాలీ అని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



