త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ ల‌భించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?

Home Loan | ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడం అత్యంత కీలకం. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణాలు సుల‌భంగా ల‌భిస్తుంటాయి.

S

Business | Published On May 3, 2026, 5.00 pm IST

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ ల‌భించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?
Advertisement

Home Loan | ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడం అత్యంత కీలకం. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణాలు సుల‌భంగా ల‌భిస్తుంటాయి. అయితే కొంతమంది తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ వారి మొత్తం ఆర్థిక స్థితిని పరిశీలించి రుణాలు మంజూరు చేసే అవకాశమూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది వ్యక్తి అప్పులు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ స్కోర్‌ను సాధారణంగా సిబిల్ స్కోర్ అని పిలుస్తారు. అయితే ఇది కేవలం ట్రాన్స్‌యూనియన్ సిబిల్ మాత్రమే కాకుండా ఎక్స్‌పీరియన్, ఈక్విఫ్యాక్స్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ వంటి ఇతర క్రెడిట్ బ్యూరోల ద్వారా కూడా నిర్మాణ‌మ‌వుతుంది. భిన్న ర‌కాల ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు భిన్న క్రెడిట్ స్కోర్‌ల‌ను చెక్ చేస్తాయి. తరచూ ఒకటి కంటే ఎక్కువ బ్యూరోల డేటాను పరిశీలిస్తారు.

700కి పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే..

హోమ్ లోన్ పొందడానికి కనీసం 700 స్కోర్ ఉండటం మంచిది. అయితే 750కి పైగా ఉంటే ఉత్తమ ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్లు పొందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, బ్యాంకులు కేవలం స్కోర్‌ను మాత్రమే కాకుండా ఆదాయం, ఆస్తులు, కొనుగోలు చేసే ప్రాపర్టీ విలువ వంటి ఇతర అంశాలను కూడా పరిగణన‌లోకి తీసుకుంటాయి. ఇక రుణ గ్ర‌హీత‌ల‌కు క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉండాలి. 750కి పైగా స్కోర్ ఉంటే రుణం ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆదాయం స్థిరంగా ఉండాలి. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించడానికి సరిపడా ఆదాయం ఉండటం తప్పనిసరి. కేవలం వడ్డీ రేట్లకే పరిమితం కాకుండా ప్రాసెసింగ్ ఫీజులు, హిడెన్ చార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, ప్రీపేమెంట్ పెనాల్టీలు వంటి అంశాలను కూడా పరిశీలించాలి.

ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఉండాలి..

రుణ కాలవ్యవధి (టెన్యూర్) కీలకం. ఎక్కువ కాలం తీసుకుంటే ఈఎంఐ తగ్గినా మొత్తం వడ్డీ ఎక్కువ అవుతుంది. తక్కువ కాలం అయితే వడ్డీ తక్కువ అయినా ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. ఇక ఫోర్‌క్లోజర్ నిబంధనలు తెలుసుకోవాలి. ముందుగానే రుణం చెల్లించాలనుకుంటే అవి ఉపయోగపడతాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు క్రమబద్ధమైన ఆర్థిక ప్రవర్తనతో దాన్ని మెరుగుపరచుకోవచ్చు. సమయానికి బకాయిలు చెల్లించడం, పెండింగ్ అప్పులు తగ్గించడం, తరచూ కొత్త క్రెడిట్ తీసుకోవడం నివారించడం, అలాగే క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు ఉన్నాయా అని తరచూ పరిశీలించడం ద్వారా స్కోర్ పెరుగుతుంది. హోమ్ లోన్ తీసుకోవడంలో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే రుణం సులభంగా పొందడమే కాకుండా దీర్ఘకాలంలో ఆర్థిక భారం కూడా తగ్గించుకోవచ్చు.

Advertisement
Advertisement