Aadhaar | డేట్ ఆఫ్ బర్త్‌కి ప్రూఫ్‌గా ఆధార్‌ను వాడొచ్చా?.. UIDAI ఏమంటుందంటే?
Aadhaar | ఆధార్ కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై జనన ధృవీకరణకు ప్రూఫ్‌గా ఆధార్ కార్డు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
Aadhaar | త్రినేత్ర.న్యూస్: ఆధార్ కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై జనన ధృవీకరణకు ప్రూఫ్‌గా ఆధార్ కార్డు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. పుట్టిన తేదీకి (Date of Birth) అది కచ్చితమైన రుజువు కాదని స్పష్టం చేసింది. ఆధార్ కేవలం వ్యక్తి గుర్తింపునకు (Identity), అడ్రస్ ప్రూఫ్ మాత్రమేనని, మీ వయస్సు లేదా పుట్టిన తేదీకి సంబంధించిన అధికారిక పత్రం కాదని వెల్లడించింది. ఆధార్ నమోదు సమయంలో ఇచ్చే సమాచారం సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఉండటమే దీనికి కారణం.
ఆధార్ చట్టం-2016 ప్రకారం ఆధార్ ఒక వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా ఇచ్చే ఆధారం మాత్రమే. మనం ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం. పుట్టిన రోజుకు సంబంధించి సరైన ఆధారాలు లేనిపక్షంలో సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనవరి 1వ తేదీని డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. ఈ కారణంగానే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ప్రూఫ్‌గా పరిగణించరు.

బాధ్యత కార్డుదారుడిదే..
ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే, ఆ తేదీ సరైనదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్డుదారుడిదేనని UIDAI డైరెక్టర్ సంజీవ్ యాదవ్ అన్నారు. అదేవిధంగా ఆధార్ అనేది సబ్సిడీలు, ప్రభుత్వ సేవలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా లేదా అని చూసే ఒక ధృవీకరణ సాధనం మాత్రమేనని UIDAI అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. దానిని బర్త్ రిజిస్ట్రీగా చూడటం చట్టపరంగా తప్పని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై వయసు ధృవీకరణకు బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్కుల జాబితా తప్పనిసరి!
పుట్టిన తేదీ రుజువుకు..
గతంలో ఆధార్‌ను అన్నిటికీ గుర్తింపు పత్రంగా పరిగణలోకి తీసుకునేవారు. అయితే ప్రస్తుతం అందులో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలుగా ఇకపై వీటిని చూపించాలి..
- జనన ధృవీకరణ పత్రం
- 10వ తరగతి మార్క్ షీట్ (SSC)
- పాస్‌పోర్ట్
- ప్రభుత్వ అధికారి జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






