Ponnam Prabhakar | క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం
Ponnam Prabhakar | క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
- ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొన్న మంత్రి
- ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మరో తొమ్మిది మందికి ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరిన పొన్నం
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు నవీన్ కుమార్ యాదవ్ విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్ను స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. గురువారం ‘ఖేలో తెలంగాణ బంధన్’ కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, సైక్లింగ్, యోగా లేదా తమకు అనువైన శారీరక వ్యాయామం కోసం సమయం కేటాయించాలని సూచించారు.
శారీరక దృఢత్వం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ, సామాజిక శ్రేయస్సుకు కూడా దోహదపడుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఫిట్నెస్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తమ వ్యాయామానికి సంబంధించిన 27 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, తొమ్మిది మంది మిత్రులను ట్యాగ్ చేయడంతోపాటు మరో తొమ్మిది మందిని ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాలని కోరారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే ఫిట్నెస్ ఉద్యమం ప్రజల్లోకి విస్తృతంగా చేరుతుందని అన్నారు. క్రీడలు కేవలం పోటీలు, పతకాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి విద్యాసంస్థలో క్రీడా సంస్కృతి పెంపొందాలని మంత్రి ఆకాంక్షించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శారీరక వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిట్నెస్ ఛాలెంజ్
ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, టీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, వెల్ఫేర్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలాలకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.
బీసీ విద్యాసంస్థల్లో ఫిట్నెస్ కార్యక్రమాల విస్తరణ
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని విద్యాసంస్థల్లో ఖేలో తెలంగాణ బంధన్, ఫిట్నెస్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసే దిశగా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు కన్నం మధు, సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్.. ఫోన్లో పేరు తప్పనిసరి..
- ●Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్
- ●Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి
- ●IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?
- ●Jantar Mantar Protest Site Ban | జంతర్ మంతర్పై నిషేధం.. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
- ●Ramchandar Rao | రైతులు అల్లాడుతున్నా రోజుకు 2-3 గంటలే కరెంటిస్తున్నరు

CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్.. ఫోన్లో పేరు తప్పనిసరి..

Sapthami Gowda | మెగా హీరో సరసన కాంతార బ్యూటీ - తెలుగులో మరో ఛాన్స్

Duddilla Sridhar Babu | కేటీఆర్! ఆధారాలుంటే బయటపెట్టండి.. లేదంటే బురద జల్లడం మానుకోండి

IPO | ఐపీఓ అంటే ఏమిటి.. అందులో ఎలా పెట్టుబడులు పెట్టాలి.. జియో ఐపీఓకు దరఖాస్తు చేయొచ్చా..?




