త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Credit Card | ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. న్యూఇయర్ నుంచి కొత్త రూల్స్!

ICICI Credit Card | ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు( ICICI Credit Card ) వినియోగదారులకు షాకింగ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డు పాయింట్ల నిబంధనల్లో ఐసీఐసీఐ( ICICI ) కీలక మార్పులు చేసింది.

S

Business | Published On Dec 23, 2025, 8.46 am IST

ICICI Credit Card | ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. న్యూఇయర్ నుంచి కొత్త రూల్స్!
Advertisement

ICICI Credit Card | ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డు పాయింట్ల నిబంధనల్లో ఐసీఐసీఐ కీలక మార్పులు చేసింది. న్యూఇయర్ నుంచి ఈ కొత్త నిబంధనలు దశలవారీగా అమలుకానున్నాయని బ్యాంకు వెల్లడించింది. అయితే ఈ మార్పులతో ప్రయాణాలు, వాలెట్ లోడింగ్, ఆన్‌లైన్ గేమింగ్స్ వంటివి మరింత భారం కానున్నాయి.

ప్రయాణ ఖర్చులపైనా రుసుము

సాధారణంగా ట్రిప్‌లకు వెళ్లాలని అనుకున్నవాళ్లు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అలాంటి వారికి ఐసీఐసీఐ బ్యాంకు షాకిచ్చింది. రైల్వే, బస్ తదిరత రవాణా సేవలపై అదనంగా ఒక శాతం ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. రూ.50 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్ చేసినప్పుడు ఈ అదనపు రుసుము వసూలు చేయనుంది. అలాగే రవాణా ఖర్చులపై ఇచ్చే రివార్డు పాయింట్లలోనూ పరిమితిని విధించిందది.

- ఎమరాల్డే, ఎమరాల్డే ప్రైవేటు, సఫైరో, రూబిక్స్ కార్డులపై నెలకు రూ.20 వేల వరకు మాత్రమే రివార్డులు వస్తాయి.

- కోరల్, ప్లాటినం, మాంచెస్టర్ యునైటెడ్, సీఎస్‌కే, ఎక్స్‌ప్రెషన్స్ వంటి కార్డులపై నెలకు రూ.10 వేల వరకు మాత్రమే రివార్డులు పొందవచ్చు. ఈ పరిమితులు ప్రధానంగా రైల్వే, బస్ బుకింగ్స్‌పై వర్తిస్తాయి.

సినీ ప్రియులపైనా భారమే!

బుక్ మై షో యాప్ ఇచ్చే బై వన్ గెట్ వన్, ఉచిత టికెట్ల ఆఫర్ల నిబంధనలను కూడా ఐసీఐసీఐ బ్యాంకు కఠినతరం చేసింది. ఈ త్రైమాసికంలో ఈ ఆఫర్ పొందాలంటే.. ముందు త్రైమాసికంలో కనీసం రూ.25 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టాంట్ ప్లాటినం కార్డులపై ఫిబ్రవరి నుంచి ఈ ఆఫర్ ఉండదు.

ఆన్‌లైన్ గేమింగ్‌పై చార్జీలు

డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్, ఎంపీఎల్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే డిపాజిట్లు, సంబంధిత లావాదేవీలపై 2 శాతం ఫీజును వసూలు చేయాలని ఐసీఐసీఐ నిర్ణయించింది.

థర్డ్ పార్టీ వాలెట్ లోడింగ్‌పైనా

ఈజీ పే కోసం అమెజాన్ పే, పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఓలా మనీ వంటి వాలెట్లలో లోడ్ చేస్తే కూడా అదనపు రుసుము వసూలు చేయనున్నారు. రూ.5 వేలు లేదా అంతకంటే ఎక్కువ లోడ్ చేస్తే ఒక శాతం చార్జిని వసూలు చేయనున్నారు.

విదేశీ కరెన్సీ, డీసీసీ చార్జీలు

విదేశీ కరెన్సీకి సంబంధించి డీసీసీ చార్జీలను కూడా ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. మేక్ మై ట్రిప్ ట్రావెల్ కార్డులపై 0.99 శాతం, టైమ్స్ బ్లాక్ పై 1.49 శాతం, అమెజాన్ పే కార్డుపై 1.99 శాతం, ఎంఎంఏటీ సిగ్నేచర్, ప్లాటినం తదితర కార్డులపై గరిష్ఠంగా 3.5 శాతం చార్జీలు వసూలు చేయనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement