Bank Lockers | బ్యాంకుల్లో లాకర్‌లను తీసుకుంటున్నారా..? చార్జిలు ఎలా ఉంటాయి, ఇతర రూల్స్ తెలుసుకోండి..!
Bank Lockers | చాలా మంది విలువైన వస్తువులు లేదా పత్రాలను భద్రపరుచుకునేందుకు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తుంటారు. ఇవి వినియోగదారుల వస్తువులకు అత్యంత సెక్యూరిటీని ఇస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు తమ బ్రాంచిల్లో లాకర్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
Bank Lockers | చాలా మంది విలువైన వస్తువులు లేదా పత్రాలను భద్రపరుచుకునేందుకు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తుంటారు. ఇవి వినియోగదారుల వస్తువులకు అత్యంత సెక్యూరిటీని ఇస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు తమ బ్రాంచిల్లో లాకర్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే లాకర్ తీసుకుంటే బ్యాంకులు వసూలు చేసే ఛార్జిలు ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక రకంగా, ప్రైవేటు రంగ బ్యాంకులు మరో విధంగా భిన్న రకాలుగా లాకర్ చార్జిలను వసూలు చేస్తుంటాయి. లాకర్ సదుపాయం తీసుకోవాలని ఆలోచిస్తున్న వారు అసలు ఏయే బ్యాంకుల్లో చార్జిలు ఎలా ఉన్నాయి, బ్యాంకులు లాకర్ చార్జిలను అధికంగా వసూలు చేస్తున్నాయా.. అనే వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది.
జీఎస్టీ, ఆలస్యపు చెల్లింపు జరిమానాలు..
ఎస్‌బీఐ, కెనరా వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తక్కువ ధరలకే లాకర్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ చార్జిలు మరింత తక్కువగా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు ఎక్కువ చార్జిలను వసూలు చేస్తుంటాయి. మెట్రో బ్రాంచిలలో ఈ ఫీజు మరింత ఎక్కువగా ఉంటుంది. లాకర్ అద్దె రుసుముతోపాటు జీఎస్‌టీ, ఆలస్యపు చెల్లింపు జరిమానాలు, అదనపు సందర్శనల ఫీజులు లేదా లాకర్ తాళాలు పోగొట్టుకుంటే వసూలు చేసే చార్జిలు వంటి హిడెన్ ఫీజులు కూడా ఉంటాయి. వీటన్నింటిపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భిన్న రకాల పరిమాణాల్లో లాకర్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు వార్షికంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి. లాకర్ పరిమాణంతోపాటు బ్రాంచ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా వార్షిక ఫీజు మారుతుంది. ఎక్స్‌ట్రా స్మాల్ లాకర్‌కు మెట్రో ప్లస్ బ్రాంచిల్లో రూ.4వేలు, మెట్రో బ్రాంచ్‌లలో రూ.3,300, అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.2,200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1వేయి చెల్లించాలి. స్మాల్ లాకర్‌కు మెట్రో ప్లస్‌లలో రూ.7,500, మెట్రోలో రూ.5వేలు, అర్బన్‌లో రూ.4వేలు, సెమీ-అర్బన్‌లో రూ.3వేలు, విలేజ్ ఏరియాల్లో రూ.2వేలు చెల్లించాలి. మెట్రో ప్లస్ బ్రాంచిల్లో మీడియం లాకర్ వార్షిక ఫీజు రూ.12,500 ఉండగా, లార్జ్ లాకర్‌కు రూ.20వేలుగా ఉంది. మెట్రో బ్రాంచిలలో అయితే మీడియం లాకర్ చార్జి రూ.10వేలు, లార్జ్ లాకర్ రూ.15వేలకు వస్తుంది. అర్బన్‌లో ఇవే ధరలు రూ.7,500, రూ.10వేలు ఉండగా, సెమీ అర్బన్‌లో రూ.5వేలు, రూ.8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4వేలు, రూ.6వేలుగా ఉన్నాయి. ఇతర ప్రైవేటు బ్యాంకులు కూడా దాదాపుగా ఇదే విధానంలో లాకర్ చార్జిలను ఏడాది కాలానికి వసూలు చేస్తున్నాయి.

ఎస్‌బీఐలో..
ఎస్‌బీఐలో మెట్రో బ్రాంచిలలో చిన్న లాకర్‌కు రూ.2వేలు, మీడియం లాకర్‌కు రూ.4వేలు, పెద్ద లాకర్‌కు రూ.8వేలను ఏడాదికి చెల్లించాలి. వీటికి జీఎస్టీ చార్జిలను అదనంగా వసూలు చేస్తారు. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో అయితే చిన్న లాకర్‌కు రూ.1500, మీడియంకు రూ.3వేలు, పెద్ద లాకర్‌కు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. ఇక లాకర్ తీసుకున్న మొదటి ఏడాదిలో 12 సార్లు లాకర్‌ను చూసేందుకు ఉచితంగా అనుమతి ఇస్తారు. తరువాత ప్రతిసారి సందర్శనకు రూ.100 + జీఎస్‌టీ వసూలు చేస్తారు. లాకర్ అద్దె చెల్లింపులో ఆలస్యం జరిగితే త్రైమాసికంగా 10 శాతం నుంచి 40 శాతం వరకు జరిమానాలను విధిస్తారు.
ఐసీఐసీఐ బ్యాంకులో..
ఐసీఐసీఐ బ్యాంకులో మెట్రో ప్లస్ బ్రాంచిల్లో చిన్న లాకర్‌కు రూ.4వేలు, మీడియం లాకర్‌కు రూ.9వేలు, పెద్ద లాకర్‌కు రూ.15వేలు వసూలు చేస్తారు. మెట్రో బ్రాంచిల్లో అయితే ఇవే చార్జిలు వరుసగా రూ.3,500, రూ.7,500, రూ.13వేలుగా ఉన్నాయి. అలాగే అర్బన్ బ్రాంచిల్లో రూ.3వేలు, రూ.6వేలు, రూ.10వేల చార్జిలను వసూలు చేస్తున్నారు. సెమీ అర్బన్ ఏరియాల్లో రూ.2వేలు, రూ.5వేలు, రూ.7వేలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇవే లాకర్లకు రూ.1200, రూ.2,500, రూ.4వేలను చెల్లించాలి. చిన్న లాకర్‌లో నగలను, పెద్ద లాకర్‌లో పత్రాలు, ఇతర విలువైన వస్తువులను భద్ర పరచాలని భావిస్తే ముందుగా ధరలను తెలుసుకోవడం, ఇతర రూల్స్‌ను గమనించడం ముఖ్యం. అలాగే ఏయే బ్యాంకుల్లో ఎంత చార్జిలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. దీంతో అదనపు చార్జిలను చెల్లించే ఇబ్బంది తప్పుతుంది.
సంబంధిత వార్తలు

SBI Recruitment | ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
మే 14, 2026

SBI | భారీగా పెరిగిన ఎస్‌బీఐ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటన..
మే 8, 2026

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



