త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Money | రూ.2 కోట్ల నిధిని జ‌మ చేయాలంటే ఎంత కాలం ప‌డుతుంది.. నెల‌కు ఎంత పొదుపు చేయాలి..?

Money | డ‌బ్బు సంపాదించే వారు దాన్ని పొదుపు చేయాల్సిందే. పొదుపు మంత్రం పాటించ‌క‌పోతే జీవితంలో ఎప్పుడో ఒక‌సారి క‌ష్టాలు చుట్టుముడ‌తాయి. డ‌బ్బు పొదుపు చేస్తే భ‌విష్య‌త్తులో పిల్ల‌ల చ‌దువులు లేదా కుటుంబ ఖ‌ర్చుల‌కు, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు తోడ్ప‌డుతుంది. డ‌బ్బును పొదుపు చేసేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

S

Business | Published On Mar 22, 2026, 10.52 am IST

Money | రూ.2 కోట్ల నిధిని జ‌మ చేయాలంటే ఎంత కాలం ప‌డుతుంది.. నెల‌కు ఎంత పొదుపు చేయాలి..?
Advertisement

Money | డ‌బ్బు సంపాదించే వారు దాన్ని పొదుపు చేయాల్సిందే. పొదుపు మంత్రం పాటించ‌క‌పోతే జీవితంలో ఎప్పుడో ఒక‌సారి క‌ష్టాలు చుట్టుముడ‌తాయి. డ‌బ్బు పొదుపు చేస్తే భ‌విష్య‌త్తులో పిల్ల‌ల చ‌దువులు లేదా కుటుంబ ఖ‌ర్చుల‌కు, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో లేదా రిటైర్మెంట్ ప్లానింగ్‌కు తోడ్ప‌డుతుంది. డ‌బ్బును పొదుపు చేసేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మందికి తెలిసిన‌, బాగా పాపుల‌ర్ అయిన ప‌ద్ధ‌తి మ్యుచువ‌ల్ ఫండ్స్‌. వీటిల్లో నెల‌వారి SIP వేస్తే ఎంతో డ‌బ్బును త‌క్కువ కాలంలోనే పొదుపు చేయ‌వ‌చ్చు. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఎన్నో వేల‌కు పైగా మ్యుచ‌వ‌ల్ ఫండ్ స్కీమ్‌ల‌ను అందిస్తున్నాయి. చాలా స్కీమ్‌ల‌లో రాబ‌డి అధికంగా కూడా ఉంటోంది. అయితే భారీ ఎత్తున నిధిని జ‌మ చేయాలంటే ఎంత కాలం ప‌డుతుంది, నెల‌కు ఎంత పొదుపు చేస్తే అంత‌టి భారీ నిధిని జ‌మ చేయ‌వ‌చ్చు.. అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాటికి ఆర్థిక నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు.

SIPకు ఉండే కాంపౌండింగ్ శ‌క్తి..

రూ.2 కోట్ల నిధిని జ‌మ చేయ‌డ‌మే ల‌క్ష్యం అయితే నెల‌కు క‌నీసం రూ.20వేల‌ను పొదుపు చేయాల్సి ఉంటుంది. దీర్ఘ‌కాలికంగా, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో నెల నెలా డ‌బ్బును SIP వేస్తే సంప‌దను సృష్టించుకోవ‌చ్చు. SIPల‌కు ఉన్న కాంపౌండింగ్ శ‌క్తి వ‌ల్ల త‌క్కువ వ్య‌వ‌ధిలోనే భారీ ఎత్తున నిధి జ‌మ అవుతుంది. రూ.2 కోట్ల నిధికి నెల‌కు రూ.20వేల‌తో SIP ప్రారంభించ‌వ‌చ్చు. అయితే పెట్టుబ‌డిని పెట్ట‌డం ఆల‌స్యం చేస్తే త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో అధిక మొత్తం నిధిని జ‌మ చేయాల్సి వ‌స్తుంది. ఇది క‌ష్టంగా ఉంటుంది. దీని వ‌ల్ల నెల నెలా ఎక్కువ మొత్తంలో డ‌బ్బును SIP వేయాల్సి వ‌స్తుంది. క‌నుక వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే SIP ను ప్రారంభిస్తే మంచిది. దీని వ‌ల్ల త‌గిన టైమ్‌లో డ‌బ్బు చేతికి వ‌స్తుంది. అది ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

సాధార‌ణ SIP అయితే..

నెల‌కు రూ.20వేల చొప్పున SIP లో పెట్టుబ‌డి పెడితే సంవ‌త్స‌రానికి 12 శాతం రాబ‌డి అంచ‌నా వేస్తే రూ.2 కోట్ల ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు దాదాపుగా 21 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి ప‌డుతుంది. మొత్తం పెట్టుబ‌డి రూ.50.40 ల‌క్ష‌లు కాగా దీనికి 12 శాతం రాబ‌డిని అంచ‌నా వేస్తే రూ.1,77,33,484 అవుతుంది. కాల వ్య‌వ‌ధి పూర్త‌య్యే స‌రికి చేతిలో రూ.2,27,73,484 ఉంటాయి. అయితే ప్ర‌తి సంవ‌త్సం పెట్టుబ‌డి మొత్తాన్ని ఇంకా పెంచుతూ పోతే వ‌చ్చే లాభం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. దీన్నే స్టెప్ అప్ SIP అని అంటారు. ఏటా కనీసం 10 శాతం పెట్టుబ‌డి మొత్తాన్ని పెంచితే నిధి ఇంకా ఎక్కువ జ‌మ అవుతుంది. మొద‌టి సంవ‌త్స‌రం నెల‌కు రూ.20వేలు SIP వేస్తే త‌రువాతి ఏడాది 10 శాతం పెంచాక నెల‌కు రూ.22వేలు SIP వేయాల్సి ఉంటుంది. దీంతో 16 సంవ‌త్స‌రాల్లోనే రూ.2 కోట్ల నిధి జ‌మ అవుతుంది. ముందు చెప్పిన ఉదాహ‌ర‌ణ‌తో పోలిస్తే ఇక్క‌డ 5 ఏళ్లు త‌గ్గుతున్నాయి. కార‌ణం పెట్టుబడి మొత్తాన్ని పెంచ‌డ‌మే. ఇలా చేయ‌డం వ‌ల్ల అనుకున్న నిధి ఇంకా త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలోనే చేతికి అందుతుంది.

స్టెప్ అప్ SIP అయితే..

స్టెప్ అప్ SIP ద్వారా ఏటా 10 శాతం పెట్టుబ‌డి మొత్తాన్ని పెంచుతూ డ‌బ్బును పొదుపు చేస్తే 16 ఏళ్ల‌లో మొత్తం పెట్టుబ‌డి రూ.86,27,796 అవుతుంది. రాబ‌డి ఏడాదికి 12 శాతం అనుకుంటే లాభం రూ.1,20,12,478 అవుతుంది. అప్పుడు కాల‌వ్య‌వధి ముగిశాక మొత్తం డ‌బ్బు విలువ రూ.2,06,40,274 అవుతుంది. ఇలా స్టెప్ అప్ సిప్ ద్వారా త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలోనే అనుకున్న నిధిని జ‌మ చేయ‌వ‌చ్చు. అయితే పెట్టుబ‌డిదారులు ఎంచుకునే మ్యుచువ‌ల్ ఫండ్ స్కీమ్ ల‌కు అనుగుణంగా రాబ‌డి ఉంటుంది. ఇక్క‌డ 12 శాతం అనేది స‌గటున తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స్కీమ్‌ల‌లో 15 నుంచి 24 శాతం వ‌ర‌కు కూడా రాబ‌డిని ఇచ్చేవి ఉన్నాయి. క‌నుక పెట్టుబ‌డిదారులు త‌మ సొంత నిర్ణ‌యం లేదా నిపుణుల స‌ల‌హాలతో పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో అధిక లాభాల‌ను త‌క్కువ స‌మ‌యంలోనే పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement