త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Home Loan Interest | హోం లోన్ తీసుకుంటున్నారా..? ఈ చిన్న సూచ‌న పాటిస్తే భారీ ఎత్తున వ‌డ్డీ ఆదా అవుతుంది..!

Home Loan Interest | గ్రామాల్లో సొంత ఇల్లును క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో జీవ‌నం కార‌ణంగా ఆయా ప్రాంతాల్లో సొంత ఇంటిని నిర్మించుకోవాల‌ని చాలా మందికి ఆశ‌యంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవ‌రైనా స‌రే సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌ని ఆలోచిస్తుంటారు.

S

Business | Published On Feb 15, 2026, 11.26 am IST

Home Loan Interest | హోం లోన్ తీసుకుంటున్నారా..? ఈ చిన్న సూచ‌న పాటిస్తే భారీ ఎత్తున వ‌డ్డీ ఆదా అవుతుంది..!
Advertisement

Home Loan Interest | గ్రామాల్లో సొంత ఇల్లును క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో జీవ‌నం కార‌ణంగా ఆయా ప్రాంతాల్లో సొంత ఇంటిని నిర్మించుకోవాల‌ని చాలా మందికి ఆశ‌యంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవ‌రైనా స‌రే సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకోవాల‌ని ఆలోచిస్తుంటారు. అయితే చాలీ చాల‌ని జీతం లేదా ఆదాయంతో భారీగా ధ‌ర క‌లిగి ఉండే ఇల్లు లేదా ఫ్లాట్‌ను ఒకేసారి కొనుగోలు చేయాలంటే ఇబ్బందే. అందుకు గాను క‌చ్చితంగా హోం లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అనేక బ్యాంకులు సుల‌భ‌మైన వాయిదాల్లో త‌క్కువ వ‌డ్డీ రేట్లను హోం లోన్ల‌లో అందిస్తున్నాయి. క‌నుక చాలా మంది ఇంటి రుణాల‌ను తీసుకుంటున్నారు. ఇది చాలా సుర‌క్షిత‌మైన లోన్ కూడా. ఇంటి య‌జ‌మాని అనుకోకుండా దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌ను కోల్పోయినా కుటుం స‌భ్యుల‌పై భారం ప‌డ‌దు. లోన్ తీసుకునే స‌మ‌యంలో ముందుగానే రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఇన్సూరెన్స్ చేయిస్తారు. క‌నుక త‌రువాతి రోజుల్లో వారికి ఏం జ‌రిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నుంచి బ్యాంకులు ఇంటి రుణాన్ని తీసుకుంటాయి. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు ఇల్లు ద‌క్కుతుంది. ఆర్థిక భారం ప‌డ‌దు.

రూ.40 ల‌క్ష‌లు లోన్ తీసుకుంటే..

అయితే ఇంటి రుణాలు సాధార‌ణంగా దీర్ఘ‌కాలిక వ్య‌వ‌ధితో మంజూరు చేస్తారు. ఈ రుణాల‌కు కాల ప‌రిమితి 10 నుంచి 30 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలో వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు, సుల‌భమైన వాయిదాలు ల‌భిస్తాయి. క‌నుక ఇంటి రుణాల ప‌ట్ల స‌హ‌జంగానే చాలా మంది ఆక‌ర్షితులు అవుతుంటారు. అయితే ఇంటి రుణం తీసుకునే వారు నిపుణులు చెప్పిన ఈ సూచ‌న‌ను పాటిస్తే ఇంటి రుణంపై ఏకంగా రూ.14 ల‌క్ష‌ల మేర డ‌బ్బును ఆదా చేసే అవ‌కాశం ఉంటుంది. రూ.40 ల‌క్ష‌ల లోన్ తీసుకున్న వారు ఆ మేర ఆదా చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 20 ఏళ్ల కాలానికి గాను 9.50 శాతం వ‌డ్డీ రేటుతో రూ.40 ల‌క్ష‌ల లోన్ తీసుకుంటే రూ.14 ల‌క్ష‌ల‌ను ఆదా చేయ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

రూ.14 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదా..

పైన తెలిపిన కాలానికి గాను ఇంటి రుణం తీసుకుంటే అప్పుడు నెల‌కు దాదాపుగా రూ.37,285 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో చెల్లించే మొత్తం వ‌డ్డీ రూ.49,48,459 అవుతుంది. ఇక మొత్తం రుణంతో క‌లిపి బ్యాంకుకు రూ.89,48,459 చెల్లించాల్సి వ‌స్తుంది. అయితే ఇక్క‌డే చిన్న లాజిక్ ఉంటుంది. అదంటంటే మీరు నెల‌కు చెల్లించే రూ.37,285 ఈఎంఐకి అద‌నంగా మ‌రో రూ.4,484 క‌ల‌పండి. అప్పుడు రూ.41,769 అవుతుంది. ఇక ఆ మొత్తాన్ని ముందు చెప్పిన‌ట్లు 20 ఏళ్ల కాలానికి కాకుండా 15 ఏళ్ల‌కే చెల్లించండి. అంటే లోన్ కాల వ్య‌వ‌ధిని 20 ఏళ్లు కాకుండా 15 ఏళ్ల‌కు సెట్ చేసుకోండి. దీంతో ఈఎంఐ మొత్తం కాస్త పెరుగుతుంది. అలాగే లోన్ కాల‌వ్య‌వ‌ధి 5 ఏళ్లు త‌గ్గుతుంది. ఇలా ఈ చిన్న సూచ‌న పాటిస్తే ఏకంగా రూ.14 ల‌క్ష‌లు ఆదా అవుతాయి.

ఇవి కూడా చూడండి..

9.50 శాతం వ‌డ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.40 ల‌క్ష‌ల లోన్‌కు గాను మొత్తం వ‌డ్డీ రూ.49,48,459 అవుతుంది. కానీ పైన తెలిపిన‌ట్లుగా చేస్తే.. అంటే అదే వడ్డీ రేటుతో 15 ఏళ్ల కాలానికి రూ.40 ల‌క్ష‌ల లోన్‌కు మొత్తం వ‌డ్డీ రూ.35,18,418 అవుతుంది. అంటే రూ.14 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ త‌గ్గుతుంద‌న్న‌మాట‌. ఇలా ఇంటి రుణంపై చాలా వ‌ర‌కు వ‌డ్డీని ఆదా చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే రుణం పొందే స‌మ‌యంలో వ‌డ్డీ రేటు ఇంకా త‌క్కువ వ‌చ్చేలా చూసుకుంటే మొత్తం చెల్లించే వ‌డ్డీ కూడా ఇంకా త‌గ్గుతుంది.

భౌతికంగా క‌నిపించ‌క‌పోయినా..

ఇక అలా ఆదా చేసే రూ.14 ల‌క్ష‌లు మ‌న ద‌గ్గ‌ర ఉండ‌వు క‌దా.. అని చాలా మందికి సందేహం రావ‌చ్చు. కానీ ఈ ప‌ద్ధ‌తిని ఆ దృష్టి కోణంతో చూడ‌కూడ‌దు. ఎందుకంటే సాధారణంగా చాలా మంది 20 ఏళ్ల కాలానికి ఇంటి రుణం తీసుకుంటారు. క‌నుక దాన్ని త‌గ్గించి 15 ఏళ్ల‌కు పెట్టుకుంటే అప్పుడు బ్యాంకుల‌కు అద‌నంగా ఆ మొత్తం వ‌డ్డీని చెల్లించే అవ‌స‌రం త‌ప్పుతుంది క‌దా. అలాంట‌ప్పుడు దాన్ని మ‌నం ఆదా చేసినట్లే అవుతుంది. అది భౌతికంగా మ‌న‌కు క‌నిపించ‌దు. కానీ మ‌న‌పై ఆ మేర భారం త‌గ్గిన‌ట్లు భావించాలి. ఇంటి రుణాల‌ను తీసుకునే స‌మ‌యంలో చాలా మంది ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌పై దృష్టి పెట్ట‌రు. దీని వ‌ల్ల బ్యాంకుల‌కు ఏళ్ల త‌ర‌బ‌డి అధిక మొత్తంలో వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. అదే ఈ సూచ‌న పాటిస్తే డ‌బ్బును ఆదా చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement