త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HDFC | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం.. సొంత ఉన్నతాధికారులకే జరిమానా..!

HDFC | దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు సొంత మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో), గ్రూప్‌ హెడ్‌-రిటైల్‌ అసెట్స్‌లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.

P

Business | Published On Jul 27, 2026, 7.18 pm IST

HDFC | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కీలక పరిణామం.. సొంత ఉన్నతాధికారులకే జరిమానా..!
Advertisement

HDFC | దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు సొంత మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), సీఈవో, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో), గ్రూప్‌ హెడ్‌-రిటైల్‌ అసెట్స్‌లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. సొంతంగా ఉన్నతస్థాయి అధికారులపై బ్యాంకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం బ్యాంకింగ్‌ రంగంలో అరుదైన పరిణామంగా నిలిచింది. వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌ఆర్‌డీసీ)తో డిపాజిట్‌ ఒప్పందాలకు సంబంధించి జరిగిన అంతర్గత సమీక్షలో ‘బిజినెస్‌ ఓవర్‌రీచ్‌’ జరిగినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు వెల్లడించింది. 2017, 2021లో ఎంఎస్‌ఆర్‌డీసీ నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలను స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ పరిశీలించింది.

కమిటీ నివేదిక ఆధారంగా జూలై 23న జరిగిన బోర్డు సమావేశంలో సంబంధిత అధికారుల వ్యవహారంపై చర్చించారు. వ్యాపార లక్ష్యాల సాధనలో భాగంగా కొన్ని నిర్ణయాలు నియంత్రణ పరిమితులను దాటినట్లు బోర్డు గుర్తించింది. ఈ వ్యవహారంలో అధికారులకు ఎలాంటి వ్యక్తిగత లాభం, దురుద్దేశం ఏమీ లేద‌ని విచారణలో తేలినట్లు బ్యాంకు తెలిపింది. అయితే, తీసుకున్న నిర్ణయాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని బోర్డు అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి నియంత్రణపరమైన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన బ్యాంకు.. ఉన్నతాధికారులతో పాటు ఈ ప్రక్రియలో భాగమైన ఇతర ఉద్యోగులకు కూడా హెచ్చరిక లేఖలు జారీ చేసింది. సాధారణంగా బ్యాంకులపై నియంత్రణ సంస్థలు జరిమానాలు విధించే పరిస్థితుల్లో.. స్వయంగా అంతర్గత సమీక్ష ఆధారంగా సొంత ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్పొరేట్‌ పాలనలో బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా సంకేతాలు పంపింది.

Advertisement
Advertisement