బడ్జెట్ 2026: కేంద్రం భారీ అప్పులు? రూ. 17 లక్షల కోట్ల సమీకరణకు ప్రయత్నాలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.16 నుండి 17 లక్షల కోట్ల మేర అప్పులు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత అప్పుల చెల్లింపులు, ద్రవ్య లోటును భర్తీ చేయడానికి ఈ నిధులు అవసరమని భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో 'డెట్-టు-జీడీపీ' నిష్పత్తిని ప్రధాన ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.
సంక్షిప్త సారాంశం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ రుణాల ద్వారా రూ. 16 నుండి 17 లక్షల కోట్లను సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా రూ. 5.5 లక్షల కోట్ల పాత రుణాల చెల్లింపులు ఉండటమే ఈ భారీ అప్పులకు కారణమని తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ద్రవ్య లోటు కంటే 'అప్పు-జీడీపీ నిష్పత్తి'ని (Debt-to-GDP ratio) తగ్గించడంపైనే ఎక్కువ దృష్టి సారించనుంది. ఒకవేళ ప్రభుత్వం అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేస్తే, మార్కెట్‌లో వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (FY 26-27)లో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ (Debt Securities) నుండి సుమారు రూ.16 లక్షల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పాత బాండ్ల గడువు ముగియడం (Redemptions), ప్రభుత్వ వ్యయాలను భర్తీ చేయడం దీనికి ప్రధాన కారణం.
FY25 బడ్జెట్ కంటే ఎక్కువ అప్పు
2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14.82 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం చేయబోయే అప్పు రూ.16 - 17 లక్షల కోట్లుగా ఉంది.
పాత అప్పుల చెల్లింపులే భారం
వచ్చే ఏడాది సుమారు రూ. 5.5 లక్షల కోట్ల పాత అప్పులను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. దీనివల్ల స్థూల రుణాల పరిమాణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్థూల రుణాలు రూ.16 లక్షల కోట్లుగా, నికర రుణాలు రూ. 11.6 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ సమీర్ నారంగ్ అభిప్రాయం పడ్డారు.
కొత్త లక్ష్యం: డెట్-టు-జీడీపీ నిష్పత్తి
ఇప్పటివరకు ప్రభుత్వం 'ద్రవ్య లోటు' (Fiscal Deficit)ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకునేది. కానీ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం 'డెట్-టు-జీడీపీ' (అప్పు-జీడీపీ నిష్పత్తి)ని ప్రాథమిక కొలమానంగా తీసుకోనుంది. 2026 మార్చి నాటికి ఈ నిష్పత్తిని 56 శాతం నుంచి 55 శాతానికి తగ్గించాలని, 2031 నాటికి 50 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2014 నుంచి కేంద్రం తీసుకున్న అప్పు
మార్చి 2014 నాటికి అప్పటి కేంద్ర ప్రభుత్వం వద్ద మొత్తం అప్పు సుమారు రూ.58.6 లక్షల కోట్లుగా ఉండేది. మార్చి 2025 నాటికి కేంద్రం అప్పు సుమారు రూ.185.11 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా వేయబడింది. అంటే 11 ఏళ్లలో దాదాపు అప్పు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) పూర్తయ్యే నాటికి ఈ మొత్తం అప్పు రూ.200.16 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అధిక భాగం దేశీయ మార్కెట్ నుంచే
ఈ అప్పులో అధిక భాగం అంటే సుమారు 95 శాతం దేశీయ మార్కెట్ నుంచి సేకరించినదే. మిగిలిన 5 శాతం విదేశీ రుణం. ప్రభుత్వానికి వస్తున్న రాబడిలో ఎక్కువ భాగం పాత అప్పుల వడ్డీలకు కట్టడానికే వెచ్చిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులు పెరగడంతో అప్పులు ఒక్కసారిగా 9 శాతం వరకు పెరిగాయి.
మార్కెట్ ప్రభావం
ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తే బాండ్ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అంచనాల కంటే ఎక్కువ రుణాలు సేకరిస్తే, బాండ్ ఈల్డ్స్ (వడ్డీ రేట్లు) 5 నుండి 10 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
వార్షిక రుణాల వివరాలు (రూ. లక్షల కోట్లలో)
- ఆర్థిక సంవత్సరం ముగింపు దేశీయ రుణం (Internal Debt) విదేశీ రుణం (External Debt) మొత్తం అప్పు (Total)
మార్చి 2014 56.2 2.4 58.6
మార్చి 2015 62.9 2.1 65.0
మార్చి 2016 69.7 2.3 72.0
మార్చి 2017 78.4 2.6 81.0
మార్చి 2018 87.1 2.9 90.0
మార్చి 2019 95.2 2.8 98.0
మార్చి 2020 102.0 3.1 105.1
మార్చి 2021 118.2 3.7 121.9
మార్చి 2022 134.5 4.2 138.7
మార్చి 2023 150.7 4.9 155.6
మార్చి 2024 163.4 5.4 168.8
మార్చి 2025 175.56 6.18 181.7 - మార్చి 2026 (అంచనా) 190.15 6.64 196.79
విదేశీ రుణాన్ని ప్రస్తుత కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రేట్ల ప్రకారం లెక్కిస్తే, అన్నీ కలిపి మొత్తం అప్పు మార్చి 2025 నాటికి రూ.185.11 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2026 నాటికి రూ.200.16 లక్షల కోట్లకు చేరుకోనుంది.
ప్రభుత్వ మొత్తం అప్పులో అథ్యధిక భాగం 96 శాతం దేశీయ అప్పు కాగా, అందులో మార్కెట్ రుణాలు(బాండ్లు), ట్రెజరీ బిల్లులు, ఇతర సెక్యూరిటీలు ఉన్నాయి.
విదేశీ రుణాల్లో భాగంగా విదేశీ సంస్థల నుంచి రూ.6.18 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. డెట్ టు జీడీపీ చూసుకుంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పు దేశ జీడీపీలో 57.1 శాతంగా ఉంది. ఈ సంవత్సరం ద్రవ్య లోటు జీడీపీలో 4.8 శాతానికి పరిమితం చేసే లక్ష్యంతో కేంద్రం ముందుకెళ్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prahlad Joshi | తెలంగాణకు ఏం ఇవ్వలేదని తప్పుడు ప్రచారం : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఫిబ్రవరి 6, 2026

New IT Rules 2026 | ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 15 ముఖ్య రూల్స్ ఇవే..!
ఫిబ్రవరి 4, 2026

Kishan Reddy | ఇది ఉచితాల బడ్జెట్ కాదు.. యువతకు భవిష్యత్‌ను ఇచ్చే బడ్జెట్ : కిషన్ రెడ్డి
ఫిబ్రవరి 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



