త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIM Binding | వాట్సాప్‌, టెలిగ్రామ్ కంపెనీల‌కు ఊర‌ట‌.. సిమ్ బైండింగ్ అమ‌లు గ‌డువు పొడిగించే ఛాన్స్‌..!

SIM Binding | ప్ర‌ముఖ మెసేజింగ్ కంపెనీలు వాట్సాప్‌, టెలిగ్రామ్ స‌హా ప‌లు కంపెనీల‌కు కేంద్రం తాత్కాలిక ఊర‌ట ఇవ్వ‌నుంది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన ‘సిమ్ బైండింగ్’ రూల్ అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించేందుకు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

P

Business | Published On Mar 30, 2026, 5.45 pm IST

SIM Binding | వాట్సాప్‌, టెలిగ్రామ్ కంపెనీల‌కు ఊర‌ట‌.. సిమ్ బైండింగ్ అమ‌లు గ‌డువు పొడిగించే ఛాన్స్‌..!
Advertisement

SIM Binding | ప్ర‌ముఖ మెసేజింగ్ కంపెనీలు వాట్సాప్‌, టెలిగ్రామ్ స‌హా ప‌లు కంపెనీల‌కు కేంద్రం తాత్కాలిక ఊర‌ట ఇవ్వ‌నుంది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన ‘సిమ్ బైండింగ్’ రూల్ అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించేందుకు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కంపెనీల‌కు సాంకేతిక ఇబ్బందులు కార‌ణంగా మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోర‌గా.. ఈ మేర‌కు డాట్ గ‌డువును పొడిగించే విష‌యాన్ని ప‌రిశీలిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో డాట్ ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

మొబైల్ నంబ‌ర్‌తో యూజ‌ర్ల‌ను గుర్తించే యాప్‌లో కేవ‌లం యూజ‌ర్ ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డ్‌తో మాత్ర‌మే లింక్ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపింది. అంటే యాక్టివ్ సిమ్ లేకుండా యాప్‌ల‌ను ఉప‌యోగించ‌డం సాధ్యం కాద‌న్న‌మాట‌. సైబ‌ర్ మోసాల‌ను నిరోధించే దిశ‌లో తీసుకున్న ముంద‌డుగుగా భావిస్తున్నారు. అదే సమయంలో వెబ్ వెర్షన్ విష‌యంలోనూ క‌ఠిన రూల్స్ అమ‌లు చేస్తోంది. యూజ‌ర్లు ప్ర‌తి ఆరు గంట‌ల‌కు లాగ్ అవుట్ అయ్యి.. తిరిగి మ‌ళ్లీ క్యూఆర్ కోడ్‌తో వెరిఫై చేయాల్సి రానుంది.

అయితే, ఈ విధానాన్ని అమ‌లు చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని కంపెనీలు పేర్కొన్నాయి. వివిధ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ఉన్న డివైజెస్ కార‌ణంగా అమ‌లు సాధ్యం కాద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. ఫీచ‌ర్ తొలుత ఆండ్రాయిడ్‌లో అమ‌లు కానుంది. ఐఓఎస్‌లో సాంకేతిక సమస్యలు ఉండ‌డంతో ఆపిల్ దానిపై ప‌ని చేస్తోంది. మెటా సంస్థకు చెందిన వాట్సాప్, ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ ప్రారంభించింది. అలాగే, జోహో సంస్థ తన అర‌ట్టై యాప్ విష‌యంలో డాట్‌తో క‌లిసి సిస్ట‌మ్ అమ‌లు చేస్తోన్న‌ట్లు తెలిపింది.

సిమ్ బైండింగ్ రూల్స్ అంటే..

వాట్సాప్ అకౌంట్‌ని క్రియేట్ చేయ‌డానికి ఉప‌యోగించిన ఫోన్ నంబ‌ర్‌తో ఒకే సిమ్ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండాలి. ఆ సిమ్ డియాక్టివేట్ చేసినా, లేదంటే సిమ్ తీసివేసినా ఆ యాప్ ఆ ఫోన్‌లో ప‌ని చేయ‌దు. ఇప్పటివరకు యూజర్లు 6-అంకెల ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యే అవ‌కాశం ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం యాప్ పీరియాడిక్‌గా సిమ్ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ నిర్ణ‌యంతో సైబర్ క్రైమ్స్‌పై నియంత్రణ మరింత బలపడుతుందని, డిజిటల్ సెక్యూరిటీ మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement