Gold Silver Price Today | దిగివస్తున్న పసిడి..! ఒకే రోజు రూ.14వేలు పతనమైన వెండి..!
Gold Silver Price Today | బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1.50లక్షలకు చేరింది. అదే సమయంలో వెండి ధర రూ.14వేలు పతనమై.. కిలోకు రూ.2.33 లక్షలకు పడిపోయింది.
Gold Silver Price Today | బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1.50లక్షలకు చేరింది. అదే సమయంలో వెండి ధర రూ.14వేలు పతనమై.. కిలోకు రూ.2.33 లక్షలకు పడిపోయింది. పసిడి ధరలు మధ్యాహ్నం 3 గంటల సమయానికి.. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,590కి పెరగ్గా.. కిలో వెండి ధర రూ.2.39 లక్షలకు చేరుకుంది. ఉదయం 11 గంటల సమయానికి, 10 గ్రాముల బంగారం ధర రూ. 1.51 లక్షలకు పడిపోగా.. వెండి ధరలు రూ. 9,720 తగ్గి కిలోకు రూ. 2.37 లక్షలకు చేరాయి. ఇదిలా ఉండగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. గురువారం కిలో వెండి ధర రూ. 30,300 తగ్గి రూ. 2.68 లక్షలకు చేరగా.. 10 గ్రాముల బంగారం ధర రూ. 4,500 తగ్గి రూ. 1.6 లక్షలకు తగ్గిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ దాదాపు రెండు వారాల గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాల నేపథ్యంలో గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. డాలర్ బలపడడంతో డిమాండ్‌పై ప్రభావం చూపింది. స్పాట్ బంగారం ధరలు 2.5శాతం తగ్గి ఔన్సుకు 4,838.81 డాలర్లకు పడిపోయాయి. ఏప్రిల్ డెలివరీకి సంబంధించి యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ సైతం 1.9శాతం తగ్గి ఔన్సుకు 4,855.60 వద్ద ముగిసింది. వెండి పతనం తీవ్రంగానే ఉన్నది. స్పాట్ వెండి ధరలు 14.9శాతం దిగజారి.. ఔన్స్‌కు 74.94కి చేరాయి. గతవారం సిల్వర్ ఔన్స్‌కు 141.64 డాలర్ల వద్ద రికార్డు గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే.
Read Also :
RBI | ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథం
Credit Card | బ్యాంకు ఖాతా లేకుండా క్రెడిట్ కార్డు పొందవచ్చా..?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





