త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price Today | బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఒకేరోజు భారీగా ధ‌ర‌లు ప‌త‌నం..!

Gold-Silver Price Today | బంగారం, వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు భారీ ఊర‌ట క‌ల్పించాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఇటీవ‌ల స‌రికొత్త గ‌రిష్టాల‌ను తాకిన బంగారం ధ‌ర‌లు.. శుక్ర‌వారం భారీగా ప‌త‌న‌మ్యాయి. బంగారం, వెండి వ‌న్నె త‌గ్గింది. వెండి కిలోకు రూ.20వేలు త‌గ్గింది.

P

Business | Published On Jan 30, 2026, 9.20 pm IST

Gold-Silver Price Today | బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఒకేరోజు భారీగా ధ‌ర‌లు ప‌త‌నం..!
Advertisement

Gold-Silver Price Today | బంగారం, వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు భారీ ఊర‌ట క‌ల్పించాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఇటీవ‌ల స‌రికొత్త గ‌రిష్టాల‌ను తాకిన బంగారం ధ‌ర‌లు.. శుక్ర‌వారం భారీగా ప‌త‌న‌మ్యాయి. బంగారం, వెండి వ‌న్నె త‌గ్గింది. వెండి కిలోకు రూ.20వేలు త‌గ్గింది. లాభాల స్వీక‌ర‌ణ, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప్ర‌తికూల ప‌వ‌నాల నేప‌థ్యంలో ధ‌ర‌ల్లో మార్పులు జ‌రిగాయి. గురువారం వెండి చ‌రిత్ర‌లో తొలిసారిగా గ‌రిష్టానికి తాకింది. శుక్ర‌వారం ఢిల్లీ బులియ‌న్ మార్కెట్‌లో ఒకే రోజు 5శాతం ప‌డిపోయి.. కిలోకు రూ.3,84,500కి చేరింది. గ‌త సెష‌న్‌లో సిల్వ‌ర్ ధ‌ర రూ.19,500 పెరిగి.. కిలోకు రూ.4,04,500 వ‌ద్ద జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ మార్కెట్‌లోనూ వెండి మెరుపు త‌గ్గింది. స్పాట్ సిల్వ‌ర్ 12.09శాతం త‌గ్గి ఔన్స్‌కు 101.47 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. ఇంట్రా ట్రేడింగ్‌లో 17.5శాతం ప‌డిపోయి ఔన్స్‌కు 95.26 డాల‌ర్ల వ‌ద్ద క‌నిష్టానికి చేరింది. ఇక బంగారం సైతం ఒకే రోజు రూ.14వేలు ప‌త‌న‌మైంది. వెండి త‌ర‌హాలోనే గోల్డ్ సైతం భారీ అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ప‌సిడి రూ.14వేలు త‌గ్గి.. తులానికి రూ.1,69ల‌క్ష‌లకి ప‌త‌న‌మైంది. గురువారం బంగారం రూ.123వేలు పెరిగి రూ.1.83ల‌క్ష‌ల వ‌ద్ద స‌రికొత్త గ‌రిష్టానికి చేరిన విష‌యం తెలిసిందే. బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌ల త‌గ్డానికి మూడు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన కమోడిటీ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. వరుసగా ప‌లు సెష‌న్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల ర్యాలీ కొన‌సాగింది. పెట్టుబ‌డిదారులు త‌మ లాంగ్ పొజిష‌న్స్‌ను త‌గ్గించుకోవ‌డంతో మార్కెట్‌లో భారీగా అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని తెలిపారు. కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్‌వాలా మాట్లాడుతూ అమెరికాలో ప్ర‌భుత్వ ష‌ట్‌డౌన్ ప్ర‌క్రియ‌ను నివారించేందుకు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, సెనేట్ డొమొక్రాట్ల మ‌ధ్య తాత్కాలిక ఒప్పందం జ‌రిగింది. దాంతో సుర‌క్షిత పెట్టుబ‌డిగా ఉన్న బంగారానికి డిమాండ్ త‌గ్గింది. ఇన్‌క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కప్పా మాట్లాడుతూ.. ఫెడరల్ రిజర్వ్ చైర్మ‌న్‌గా కెవిన్ వార్స్‌ని నామినేట్ చేస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించార‌ని, ఇది మార్కెట్‌లో అనిశ్చితి కార‌ణ‌మైంద‌ని తెలిపారు. వడ్డీ రేట్లపై కఠినమైన వైఖరిని అవలంబించవచ్చని పెట్టుబడిదారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. సాంకేతికంగా కూడా మార్కెట్ ఓవర్‌బాట్ జోన్‌లో ఉంద‌ని.. దాంతో లాభాల స్వీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement