త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Price | మ‌ళ్లీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి.. ఒకే రోజు భారీగా పెరిగిన ధ‌ర‌లు..!

Gold Price | బంగారం ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు షాక్ ఇచ్చాయి. దేశ రాజ‌ధానిలో బుధ‌వారం ధ‌ర‌లు 5శాతం పెరిగాయి. వెండి కిలోకు రూ.11వేల‌కుపైగా పెరిగి రూ.2.41 లక్షలకు చేరింది. బంగారం తులానికి రూ.1.49 లక్షలకు చేరింద‌ని ఆల్ ఇండియా స‌రాఫా అసోసియేష‌న్ ధ్రువీక‌రించింది.

P

Business | Published On Mar 25, 2026, 7.53 pm IST

Gold Price | మ‌ళ్లీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి.. ఒకే రోజు భారీగా పెరిగిన ధ‌ర‌లు..!
Advertisement

Gold Price | బంగారం ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు షాక్ ఇచ్చాయి. దేశ రాజ‌ధానిలో బుధ‌వారం ధ‌ర‌లు 5శాతం పెరిగాయి. వెండి కిలోకు రూ.11వేల‌కుపైగా పెరిగి రూ.2.41 లక్షలకు చేరింది. బంగారం తులానికి రూ.1.49 లక్షలకు చేరింద‌ని ఆల్ ఇండియా స‌రాఫా అసోసియేష‌న్ ధ్రువీక‌రించింది. వెండి ఒకే రోజు రూ.11,250 పెరిగి కిలోకు రూ.2,41,250కి పెరిగింద‌ని పేర్కొంది. 24 క్యారెట్స్ గోల్డ్ రూ.4,900 పెర‌గ‌డంతో తులం ధ‌ర రూ.1,49,800కి చేరింది. దేశీయ మార్కెట్లలో బుధవారం బంగారం ర్యాలీ మెరుగైంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క‌మోడిటీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

గ్లోబ‌ల్ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన నేప‌థ్యంలో ప‌సిడి ధ‌ర‌లు బ‌ల‌ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2శాతం పెరిగి 4,556.55 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో వెండి ధర ఔన్స్‌కు రెండు శాతం పెరిగి 72.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మిరే అసెట్ షేర్‌ఖాన్‌లో ప‌రిశోధ‌నా విశ్లేష‌కుడు ప్ర‌వీణ్ సింగ్ మాట్లాడుతూ ఇరాన్‌, యూఎస్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల మ‌ధ్య అంచ‌నాలున్నాయి. డాల‌ర్‌, క్రూడాయిల్ ధ‌ర‌లు ప‌త‌నం కాగా.. బంగారానికి ద‌న్నుగా నిలిచింది. నివేదిక‌ల ప్ర‌కారం.. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి అమెరికా 15 పాయింట్ల‌తో ఇరాన్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

ఇరాన్‌తో ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో చర్చల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని పేర్కొన్నారు. అయితే, టెహ్రాన్ మాత్రం చ‌ర్చ‌ల‌ను తోసిపుచ్చింది. వాషింగ్టన్‌తో చర్చలపై వ‌స్తున్న వార్త‌ను ఖండించింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళుతున్న కొన్ని వాణిజ్య నౌకలపై టోల్ టాక్స్ విధిస్తోంది. ఈ చర్య ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని మరింత పెంచింది. ఈ పరిణామాలు విలువైన లోహాల మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గింపు అంచనాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. చమురు ధరలు దిగిరావ‌డం, డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో బంగారానికి మ‌ళ్లీ డిమాండ్ పెరిగింది. ప్ర‌పంచ‌వ్యాప్త ప‌రిణామాలు భవిష్యత్తులో ధరలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement