Gold Loans | భారీ స్థాయిలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్.. కారణాలు ఇవే..
Gold Loans | బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతుండడంతో పెట్టుబడిదారులనే కాకుండా రుణగ్రహీతలను కూడా పసిడి ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా బంగారం ఆధారంగా తీసుకునే సెక్యూర్డ్ రుణాలు (గోల్డ్ లోన్స్) భారీగా పెరిగాయని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది.
Gold Loans | బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతుండడంతో పెట్టుబడిదారులనే కాకుండా రుణగ్రహీతలను కూడా పసిడి ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా బంగారం ఆధారంగా తీసుకునే సెక్యూర్డ్ రుణాలు (గోల్డ్ లోన్స్) భారీగా పెరిగాయని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారంపై తీసుకునే రుణాల్లో ప్రతి ఏడాది 128 శాతం పెరుగుదల నమోదవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యక్తిగత రుణాలతో పోటీ పడుతూ గోల్డ్ లోన్స్ వృద్ధిని సాధిస్తున్నాయని తేలింది. జనవరి 31 నాటికి మొత్తం బ్యాంకు రుణాల్లో 14.4 శాతం వృద్ధి చోటు చేసుకుందని ఆర్‌బీఐ తెలియజేసింది.
వ్యక్తిగత రుణాలదే అధిక వాటా..
వ్యక్తిగత రుణాలు ఇతర అన్ని విభాగాల కన్నా ఎక్కువ వేగంగా పెరుగుతున్నాయని ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బ్యాంకు రుణాల్లో పర్సనల్ లోన్స్ వాటా 34.5 శాతంగా ఉంది. ఇవి మూడవ వంతు భాగాన్ని ఆక్రమించాయి. తరువాతి స్థానంలో సేవల రంగం ఉంది. అందులోనూ ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చే రుణాలే అత్యంత వేగంగా పెరుగుతున్నాయని గుర్తించారు. ఇక ఇండస్ట్రియల్ క్రెడిట్ మాత్రం భిన్న దృశ్యాన్ని సంతరించుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) రుణాలు వేగంగా మంజూరు అవుతున్నాయని, ఈ రుణాల సంఖ్య కూడా పెరిగిందని, కానీ కార్పొరేట్ సంస్థల రుణాల వృద్ధి మాత్రం మందగించిందని వివరించింది.
పెండింగ్ గోల్డ్ లోన్స్ @ రూ.4 లక్షల కోట్లు..
బంగారు ఆభరణాలపై ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలు మొదటిసారిగా రూ.4 లక్షల కోట్ల మార్కును దాటినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేశాయి. జనవరి 31 వరకు ఇవి రూ.4,00,517 కోట్లకు చేరాయి. కొత్తగా పెరిగిన బ్యాంకు రుణాల్లో 9 శాతం వాటా గోల్డ్ లోన్స్‌దే కావడం విశేషం. జనవరి 26, 2024 నుంచి జనవరి 31, 2026 వరకు బంగారు ఆభరణాలపై పెండింగ్ రుణాలు సుమారు రూ.3.1 లక్షల కోట్లు పెరిగాయి. ఇది రెండు సంవత్సరాల్లో 338 శాతం వృద్ధిగా నమోదు అయింది. అంటే పోర్ట్ ఫోలియో నాలుగింతలకు పైగా విస్తరించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ భారీ వృద్ధికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో బంగారం ధరలు 152 శాతం పెరగడం ఒక కారణం అయితే, బంగారాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని ఇచ్చే రుణాలను తప్పనిసరిగా గోల్డ్ లోన్స్‌గా వర్గీకరించాలనే నియంత్రణ ఆదేశం మరొక కారణమని అంటున్నారు.
జనవరి 24, 2025తో పోలిస్తే జనవరి 31, 2026 నాటికి ఆహారేతర బ్యాంకు రుణాలు 14.4 శాతం పెరగగా, మార్చి 21, 2025 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రుణాల వృద్ధి 12 శాతంగా నమోదైంది. ఈ క్రమంలో ఆహారేతర రుణాల్లో రూ.21.8 లక్షల కోట్ల పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాల ద్వారా తేలింది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
అక్టోబర్ 9, 2026

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లకు గడ్డుకాలం.. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా..?
అక్టోబర్ 8, 2026

RBI Repo Rate | ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. కార్ లోన్ ఈఎంఐ ఎంత పెరుగుతుంది..?
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు



