త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold and Silver Rates | ప‌రుగుకు బ్రేక్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

Gold and Silver Rates | టీవ‌ల కాలంలో సామాన్యుల‌కు చుక్క‌లు చూపుతున్న బంగారం, వెండి ధ‌ర‌ల ప‌రుగుకు (Gold and Silver Rates) కాస్తా బ్రేక్ ప‌డింది.

G

Business | Published On Jan 16, 2026, 12.24 pm IST

Gold and Silver Rates | ప‌రుగుకు బ్రేక్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల కాలంలో సామాన్యుల‌కు చుక్క‌లు చూపుతున్న బంగారం, వెండి ధ‌ర‌ల ప‌రుగుకు (Gold and Silver Rates) కాస్తా బ్రేక్ ప‌డింది. బులియ‌న్ మార్కెట్‌లో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుండ‌టంతో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో పుత్త‌డి, వెండి ధ‌ర‌లు కాస్తా దిగివ‌చ్చాయి.

హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, ముంబైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.220 త‌గ్గడంతో రూ.1,43,400కు ప‌డిపోయింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.200 త‌గ్గుద‌ల న‌మోదై రూ.1,31,450కి చేరింది. చెన్నైలో రూ.650 త‌గ్గిన 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,44,330 వ‌ద్ద ఉండ‌గా, రూ.600 త‌గ్గుద‌ల న‌మోద‌వ‌డంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర రూ.1,32,300గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి ధ‌ర‌ రూ.220 త‌గ్గ‌డంతో రూ.1,43,550 వ‌ద్ద ప‌లుకుతుండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,31,600గా ఉంది. ఇది గురువారం నాటి కంటే రూ.200 త‌క్కువ‌.

ఇక బంగారంతో పోటీప‌డి పెరుగుతున్న సిల్వ‌ర్ మెట‌ల్ ధ‌ర కూడా స్వ‌ల్పంగా త‌గ్గింది. హైద‌రాబాద్‌లో కేజీ వెండి ధ‌ర‌ రూ.4000 ప‌డిపోవ‌డంతో ప్ర‌స్తుతం రూ.3,06,000గా ఉన్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement