Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న నష్టాల ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపైనా పడుతోంది. అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న నష్టాల ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపైనా పడుతోంది. అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండడం, పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. బులియన్ మార్కెట్లలోనూ తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే బుధవారం మాత్రం కాస్త పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.03 శాతం మేర పెరిగి 4,183 డాలర్లకు చేరగా, వెండి ధర 0.45 శాతం తగ్గి 61 డాలర్లకు వచ్చింది. ఇక దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1431 పాయింట్లు పెరిగి 1,50,300 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1414 పాయింట్లు పెరిగి 2,26,812 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,957 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,656 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,95,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,710 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,71,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,218 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,744గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,21,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,800 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
సెప్టెంబర్ 29, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
సెప్టెంబర్ 28, 2026

Gold And Silver Prices Today | వారాంతంలో బులియన్ మార్కెట్లకు స్వల్ప ఊరట.. దేశీయంగా ప్రతికూల సంకేతాలు..
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం

One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!



