త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. కార‌ణం ఇదేనా..?

Gold And Silver Prices Today | గ‌త వారం ఆసియా ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర న‌ష్టాలు సంభ‌వించిన‌ప్ప‌టికీ దేశీయ ఈక్విటీ సూచీలు మాత్రం లాభాల్లో కొన‌సాగాయి. ముఖ్యంగా అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గ‌డం, దేశీయ ఐటీ కంపెనీల ఫ‌లితాలు మెరుగ్గా ఉండ‌డం, ఏఐ కంపెనీల షేర్లు భారీగా ప‌డిపోవ‌డం భార‌త మార్కెట్ల‌కు క‌ల‌సి వ‌చ్చింది.

S

Business | Published On Oct 20, 2026, 11.48 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.8వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. కార‌ణం ఇదేనా..?
Advertisement

Gold And Silver Prices Today | గ‌త వారం ఆసియా ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర న‌ష్టాలు సంభ‌వించిన‌ప్ప‌టికీ దేశీయ ఈక్విటీ సూచీలు మాత్రం లాభాల్లో కొన‌సాగాయి. ముఖ్యంగా అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గ‌డం, దేశీయ ఐటీ కంపెనీల ఫ‌లితాలు మెరుగ్గా ఉండ‌డం, ఏఐ కంపెనీల షేర్లు భారీగా ప‌డిపోవ‌డం భార‌త మార్కెట్ల‌కు క‌ల‌సి వ‌చ్చింది. ఇదే ప్ర‌భావం కార‌ణంగా బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోరు క‌నిపించింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అయితే ఈ వారం మాత్రం ఈక్విటీ, బులియ‌న్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ దేశీయ మార్కెట్లు పాజిటివ్‌గానే ఉన్నాయ‌ని సూచిస్తున్నారు. ఇక బంగారం, వెండి ధ‌ర‌ల్లోనూ స్వ‌ల్ప దిద్దుబాటు చోటు చేసుకుంటోంది. సోమ‌వారం వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా, మంగ‌ళ‌వారం సైతం కాస్త త‌గ్గాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.42 శాతం త‌గ్గి 4,123 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.22 శాతం పెరిగి 57 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌కు మంగ‌ళ‌వారం సెల‌వు కావ‌డంతో ఉద‌యం సెష‌న్‌ను నిలిపివేశారు. సాయంత్రం సెష‌న్ య‌థావిధిగా కొన‌సాగ‌నుంది. అయితే గ‌త సెష‌న్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 652 పాయింట్లు త‌గ్గి 1,47,266 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1359 పాయింట్లు త‌గ్గి 2,09,828 వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,717 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,17,736 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,47,170 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,71,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,700 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,490 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,07,920గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,34,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,49,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,038 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,304గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,10,380 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,03,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement