Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఆస్తులపై పెట్టుబడులు పెడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఆస్తులపై పెట్టుబడులు పెడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.47 శాతం మేర తగ్గి 4,327 డాలర్లకు చేరగా, వెండి ధర 1.02 శాతం మేర పతనమై 63 డాలర్లకు చేరుకుంది. సోమవారం వినాయక చవితి సందర్భంగా దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌కు సెలవు ప్రకటించారు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి న్యూయార్క్ సెషన్ మాత్రం ఓపెన్ ఉండనుంది. అందువల్ల అదే సమయానికి గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్టుల ధరల మార్పుల వివరాలు తెలియనున్నాయి. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,409 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22, 272 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,090 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,40,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,125 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,12,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,557 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,456గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,570 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,55,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
సెప్టెంబర్ 14, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయం ఇదేనా..?
సెప్టెంబర్ 12, 2026

Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?
- ●Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!
- ●Vinayaka chavithi 2026 | వినాయకుడి వైభవం చూడాల్సిందే.. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలు ఇవే..!
- ●Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్

Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ

Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

Brahmotsavalu 2026 | బ్రహ్మోత్సవాల వెనుక కనిపించని వేల చేతులు..!



