త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అస్థిర‌త‌.. ఒక్క రోజే రూ.8వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో తీవ్ర ఒడిదుడుకులు నెల‌కొంటున్న నేప‌థ్యంలో భార‌తీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియన్ మార్కెట్ల‌లో గ‌త వారం తీవ్ర అస్థిర‌త ఉండ‌గా, ఈ వారం కూడా స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

S

Business | Published On Nov 16, 2026, 12.35 pm IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అస్థిర‌త‌.. ఒక్క రోజే రూ.8వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో తీవ్ర ఒడిదుడుకులు నెల‌కొంటున్న నేప‌థ్యంలో భార‌తీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియన్ మార్కెట్ల‌లో గ‌త వారం తీవ్ర అస్థిర‌త ఉండ‌గా, ఈ వారం కూడా స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపుతుండ‌డం మార్కెట్ల‌లో అస్థిర‌త‌ను పెంచుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర సోమ‌వారం 1.11 శాతం ప‌త‌న‌మై 3,838 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 3.01 శాతం త‌గ్గి 47 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,155 పాయింట్లు త‌గ్గి 1,34,550కి చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3.78 శాతం త‌గ్గి 1,69,819కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా తగ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,680 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,440 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,68,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,540 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,00,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,25,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,54,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,260 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.82,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,02,600 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,26,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,200 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,900గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,900 గా ఉంది.

Advertisement
Advertisement