త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | స‌మంత సీమంతం – శ్రీవిద్య సంప్ర‌దాయంలో వేడుక‌లు

స‌మంత సీమంతం వేడుకలు సోమ‌వారం జ‌రిగాయి. విద్య సంప్ర‌దాయానికి చెందిన క‌ళావ‌ర‌ణం (శ్రీక‌ల్పం) అనే విధానంలో సీమంతం జ‌రిగిన‌ట్లు స‌మంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఈ వేడుక‌ల తాలూకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స‌మంత పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Sep 15, 2026, 10.08 am IST

Samantha | స‌మంత సీమంతం – శ్రీవిద్య సంప్ర‌దాయంలో వేడుక‌లు
Advertisement

Samantha | టాలీవుడ్ హీరోయిన్ స‌మంత త్వ‌ర‌లో మాతృత్వ‌పు బంధంలోకి అడుగుపెట్ట‌బోతుంది. ప్రెగ్నెంట్‌కు ఉన్న స‌మంత‌కు సీమంతం జ‌రిగింది. శ్రీవిద్య సంప్ర‌దాయానికి చెందిన క‌ళావ‌ర‌ణం (శ్రీక‌ల్పం) అనే విధానంలో ఈ వేడుక‌లు జ‌రిగిన‌ట్లు స‌మంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఈ సీమంతం వేడుక‌ల్లో స‌మంత భ‌ర్త రాజ్ నిడిమోరు, స్టైలిష్ట్ నీర‌జ‌కోన‌, డిజైన‌ర్ శిల్పారెడ్డితో పాటు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు పాల్గొన్నారు. ఈ సీమంతం వేడుక‌ల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క‌ళావ‌ర‌ణం విధానాన్ని గురించి ఈ పోస్ట్‌లో వివ‌రించింది.

ప‌విత్ర‌మైన సంప్ర‌దాయం...

మ‌న సంప్ర‌దాయాల‌ను నేను గౌర‌విస్తా. ప్ర‌తి ఆచారం వెనుక ఏదో బ‌ల‌మైన శ‌క్తి ఉంద‌ని న‌మ్ముతా. క‌ళావ‌ర‌ణం అనేది శాక్త‌త‌త్వ శాస్త్రంలో అత్యంత ప‌విత్ర‌మైన శ్రీవిద్య సంప్ర‌దాయానికి చెందిన ఓ ఆధ్మాత్మిక‌ క్ర‌తువు. ఈ విధానంలో శ్రీవిద్య ఉపాసకుల ప్రత్యేక మంత్రోచ్ఛారణలు చేస్తూ, పవిత్ర జలాలతో గర్భిణికి అభిషేకం చేస్తారు. ఈ పూజా విధానం ద్వారా లలితా త్రిపురసుందరి దేవి దివ్య చైతన్యం, సద్గుణాలు గర్భంలో ఉన్న శిశువుతో పాటు త‌ల్లిగామార‌నున్న మ‌హిళ‌కు అందుతాయ‌ని, వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంద‌ని న‌మ్ముతుంటారు.

మూడు మిలియ‌న్ల‌ లైక్స్

ఈ విధానంలో మ‌రో ప్రాణానికి రూప‌మిస్తున్న త‌ల్లిని గౌర‌వించే ఈ ప్ర‌క్రియ న‌న్ను ఎంత‌గానో క‌దిలిచింది. గ‌ర్బంలో పెరుగుతోన్న బిడ్డ‌తో పాటు త‌ల్లిగా మార‌బోతున్న మ‌హిళ‌కు ఇదొక ఆశీర్వాదంగా ఉప‌యోగ‌ప‌డుతంది. అభిషేకం త‌ర్వాత గ‌ర్భిణిగా ఉన్న మ‌హిళ‌ను శ్రీచ‌క్ర‌యంత్రంలో కూర్చోబెడ‌తారు. దేవీ ఖ‌డ్గ‌మాల పారాయ‌ణ మ‌త్రం జ‌పిస్తారు. వీటివ‌ల్లత‌ల్లితో పాటు గ‌ర్భంలో ఉన్న శిశువుకు ర‌క్ష‌ణ క‌వ‌చం ఏర్ప‌డుతుంది అని స‌మంత పేర్కొన్న‌ది. ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది.స‌మంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై కృతిశెట్టి, న‌జ్రియా న‌జీమ్‌, లావ‌ణ్య త్రిపాఠితో ఉపాస‌న కొణిదెల రియాక్ట్ అయ్యారు. స‌మంత పెట్టిన ఈ పోస్ట్‌కు మూడు మిలియ‌న్ల‌కుపైగా లైక్స్ వ‌చ్చాయి. కోయంబ‌త్తూరులో జ‌గ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేష‌న్‌లో ఈ సీమంతం వేడుక జ‌రిగింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
Advertisement