త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హ‌రీశ్ రావు

Harish Rao | లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, వారిని ‘కల్యాణ లక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం క‌ల్యాణ ల‌క్ష్మి (Kalyan Lakshmi) అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకుని.. పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి శుక్ర‌వారంతో (అక్టోబ‌ర్ 2) 12 ఏండ్లు పూర్త‌య్యాయ‌ని చెప్పారు.

G

Telangana | Published On Oct 2, 2026, 12.16 pm IST

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, వారిని ‘కల్యాణ లక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం క‌ల్యాణ ల‌క్ష్మి (Kalyan Lakshmi) అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకుని.. పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి శుక్ర‌వారంతో (అక్టోబ‌ర్ 2) 12 ఏండ్లు పూర్త‌య్యాయ‌ని చెప్పారు. ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి.. నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మదిలో
పుట్టిన ఆలోచనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ప‌థ‌కం (Shadi Mubarak) అని తెలిపారు. 2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేసింద‌న్నారు. బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు, బంగారం అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్‌ను చూసిన కేసీఆర్ చలించిపోయార‌ని, ఇచ్చిన మాట ప్రకారం.. దగ్గరుండి ఆ బిడ్డ పెండ్లి జరిపించార‌ని గుర్తుచేశారు. అవసరమైన ఆర్థిక సాయం అందించార‌ని చెప్పారు. ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ అని చెప్పారు.

అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ (KCR).. 2017లో దానిని రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచార‌ని వెల్ల‌డించారు. తొమ్మిదిన్నరేండ్ల‌ బీఆర్‌ఎస్‌ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించార‌ని వెల్ల‌డించారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్‌.. కల్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేద‌న్నాద‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా బాల్య వివాహాల (Child Marriages) నిర్మూలనకు బలమైన పునాది వేశార‌ని, పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెండ్లి భారాన్ని తగ్గించార‌ని, ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికార‌ని చెప్పారు. పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించింద‌న్నారు. ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ అన్నారు.

చుట్టుముట్టిన నిర్ల‌క్ష్యం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టిందని విమ‌ర్శించారు. పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కల్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పాడింద‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ (BRS) ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్ (KCR Kit), న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశార‌ని చెప్పారు. అదే కోవలో కల్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తులం బంగారం ఎప్పుడిస్తారు..

ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం (Gold) ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశార‌ని మండిప‌డ్డారు. మూడేండ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశార‌ని విమ‌ర్శించారు. తులం బంగారం దేవుడెరుగు, కెసీఆర్ ఇచ్చిన రూ.లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చిందని చెప్పారు. తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించార‌ని చెప్పారు.

తెలంగాణలో మాత్రం మూడేండ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉందని విమ‌ర్శించారు. మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు.

ఆ హామీని నిల‌బెట్టుకోవాలి..

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాల‌ని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల‌న్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెండ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా.. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాల‌ని సూచించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy).. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నాన‌ని.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement