Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం పడుతుండగా, బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం పడుతుండగా, బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు కొత్తగా ఈ సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలని, కొంత కాలం వేచి చూస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక శుక్రవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 0.20 శాతం పెరిగి 4,185 డాలర్లకు చేరగా, వెండి ధర 0.39 శాతం పెరిగి 61 డాలర్లకు సమీపించింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు గత సెషన్‌లో 1354 పాయింట్లు పెరిగి 1,50,390 వద్ద స్థిరపడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2171 పాయింట్లు పెరిగి 2,25,877 వద్ద ముగిసింది. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,028 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,224 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,50,280 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,02,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,400 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,775 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,77,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,271 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,168గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,710 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,27,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold Prices | సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. దీపావళి సీజన్ కలిసొచ్చేనా..?
అక్టోబర్ 1, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●India Saudi Arabia | భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..
- ●Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
- ●Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
- ●Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- ●Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ - రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
- ●Lovlina Borgohain | పుట్టినరోజు బహుమతి.. బాక్సింగ్‌లో లవ్లీనా గోల్డ్‌మెడల్

India Saudi Arabia | భారత్-సౌదీ మధ్య సముద్రగర్భ విద్యుత్ లైన్.. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్..

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి



