త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల జోరు.. స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ వ‌చ్చింది. ఈ వారం మొత్తం లాభాల్లో కొన‌సాగిన మార్కెట్ల‌కు వ‌చ్చే వారం కీల‌కం కానుంది. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లోనూ ఈ వారం బుల్ ర్యాలీ కొన‌సాగింది.

S

Business | Published On Oct 17, 2026, 11.03 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల జోరు.. స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ వ‌చ్చింది. ఈ వారం మొత్తం లాభాల్లో కొన‌సాగిన మార్కెట్ల‌కు వ‌చ్చే వారం కీల‌కం కానుంది. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లోనూ ఈ వారం బుల్ ర్యాలీ కొన‌సాగింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. శ‌నివారం అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.11 శాతం స్వ‌ల్పంగా త‌గ్గి 4,165 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.77 శాతం త‌గ్గి 56 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 429 పాయింట్లు పెరిగి 1,47,918 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 527 పాయింట్లు లాభ‌ప‌డి 2,11,187 వ‌ద్ద ముగిసింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,765 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,18,126 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,47,660 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,76,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,200 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,535 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,08,280గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,35,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,53,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,074 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,592గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,10,740 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,07,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,600 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement