త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి..

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ స్వ‌ల్పంగా త‌గ్గుతుండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల గ‌త వారం ఈక్విటీ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బులియ‌న్ మార్కెట్ల‌లో సైతం భారీ ఎత్తున కొనుగోళ్లు క‌నిపించాయి.

S

Business | Published On Oct 19, 2026, 11.06 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ స్వ‌ల్పంగా త‌గ్గుతుండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల గ‌త వారం ఈక్విటీ మార్కెట్ల‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బులియ‌న్ మార్కెట్ల‌లో సైతం భారీ ఎత్తున కొనుగోళ్లు క‌నిపించాయి. పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపించారు. ఈ వారం కూడా పాజిటివ్‌గా ప్రారంభం అయిన నేప‌థ్యంలో బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో సోమ‌వారం ఔన్స్ బంగారం ధ‌ర 0.24 శాతం పెరిగి 4,175 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.01 శాతం మేర పెరిగి 57 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 292 పాయింట్లు పెరిగి 1,48,210కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 591 పాయింట్లు పెరిగి 2,11,636 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఒక మోస్త‌రుగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,804 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,18,432 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,48,040 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,80,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,570 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,08,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,35,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,57,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,103 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,824గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,030 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,10,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement