త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిర‌స‌న‌ అట్ట‌ర్ ఫ్లాప్ 

CJP Mumbai Protests Flops | సీఈసీ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ముంబైలోని అజాద్ మైదాన్‌లో (Azad Maidan) నిర్వహించిన లహ్రా దో తిరంగా (lehra do tiranga) కార్యక్రమానికి స్పంద‌న క‌ర‌వైంది. కేవ‌లం 50 నుంచి 150 మంది మాత్ర‌మే నిర‌స‌న‌ల్లో పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

D

National | Published On Oct 17, 2026, 10.46 am IST

CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిర‌స‌న‌ అట్ట‌ర్ ఫ్లాప్ 
Advertisement

CJP Mumbai Protests Flops | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) శుక్ర‌వారం ముంబైలో నిర్వహించిన లహ్రా దో తిరంగా (lehra do tiranga) కార్యక్రమం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఈ నిరసన ప్రదర్శనకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పంద‌న లభించలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) వేదికగా ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కూ నిర‌స‌న‌కు పోలీసులు అనుమ‌తిచ్చిన‌ప్ప‌టికీ జ‌నాలు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ కేవ‌లం విద్యార్థి సంఘాల నేత‌లు, వాలంటీర్లు మాత్ర‌మే అక్క‌డ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత విద్యార్థులు, స్థానికులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ సంఖ్య కేవ‌లం 50 నుంచి 150 మందికే ప‌రిమిత‌మైంది. చాలా కొద్ది మందితోనే నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చాలా చ‌ప్ప‌గా సాగింది. మ‌రోవైపు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో అక్క‌డ‌ దాదాపు 500 మందికిపైగా పోలీసులు మోహ‌రించడం గ‌మ‌నార్హం. ఢిల్లీలో తమ నాయకులను అరెస్ట్ చేసినట్లే ఇక్కడ కూడా అరెస్టులు అవుతాయనే భయంతో చాలా మంది ఈ నిర‌స‌న‌కు దూరంగా ఉన్న‌ట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

నేహా బోరా విడుద‌ల‌.. ఇంకా క‌స్ట‌డీలోనే దిప్కే

మ‌రోవైపు ఢిల్లీలో మాత్రం నిర్బంధాలు, ఆంక్ష‌ల న‌డుమే నిర‌స‌న కార్య‌క్ర‌మం సాగింది. జాతీయ జెండాల‌ను చేత‌బూని నిర‌స‌న‌కారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే, అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా సహా దాదాపు 150 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం నేహా బోరాను విడుద‌ల చేసిన పోలీసులు.. దిప్కేని మాత్రం కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌భుత్వ మార్పు కోస‌మే పోరాటం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణలో అవ‌క‌త‌వ‌ల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న సీజేపీ ఆందోళ‌న నేప‌థ్యంలో న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఈ పోరాటం కేవలం నిరసన మాత్రమే కాదని ప్ర‌భుత్వ మార్పు కోసమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారాలని కోరుకోవడం పౌరుల రాజ్యాంగ హక్కు అని ఆయన సమర్థించుకున్నారు.

అది అసాధ్యం.. సీఎం ఫ‌డ్న‌వీస్‌

ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ తీవ్రంగా ఖండించారు. దేశంలో బాబాసాహెబ్ అంబేద్క‌ర్ రాజ్యాంగం అమలులో ఉన్నంత కాలం.. అధికార మార్పు లేదా ప్రభుత్వ మార్పు అనేది కేవలం ఎన్నికల ద్వారా, ఓట్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇలా వీధుల్లో చేసే ఆందోళనల ద్వారా కాదని పేర్కొన్నారు. విప‌క్షాల అస‌లు రంగు ఈ వ్యాఖ్య‌ల‌తో బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

Also Read..

న్యూజిలాండ్‌లో వింత టూరిస్ట్ స్పాట్: 40 మీటర్ల కంచె నిండా వందలాది బ్రాలు.. అసలు కథేంటంటే!

వచ్చే వారం రెండు భారీ ఐపీఓలు.. రూ.31,663 కోట్ల సమీకరణ..

ఘంటానాదం.. నైవేద్యానికి సంకేతం!

Advertisement
Advertisement