త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. యుద్ధం భ‌యంతో పెట్టుబ‌డిదారుల్లో త‌గ్గిన ఆస‌క్తి..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియా యుద్ధం కార‌ణంగా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు గ‌త కొంత కాలం నుంచి భారీగా ప‌త‌న‌మ‌వుతుండ‌గా, దేశీయ సూచీలు కూడా దిగువ స్థాయిల్లో ట్రేడ‌వుతున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు యుద్ధం ముగియ‌బోతుంద‌ని గ‌త రెండు మూడు రోజుల నుంచి జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ్రేక్ ప‌డింది.

S

Business | Published On May 26, 2026, 11.40 am IST

Gold And Silver Prices Today | భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. యుద్ధం భ‌యంతో పెట్టుబ‌డిదారుల్లో త‌గ్గిన ఆస‌క్తి..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియా యుద్ధం కార‌ణంగా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు గ‌త కొంత కాలం నుంచి భారీగా ప‌త‌న‌మ‌వుతుండ‌గా, దేశీయ సూచీలు కూడా దిగువ స్థాయిల్లో ట్రేడ‌వుతున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు యుద్ధం ముగియ‌బోతుంద‌ని గ‌త రెండు మూడు రోజుల నుంచి జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ్రేక్ ప‌డింది. ద‌క్షిణ ఇరాన్‌పై అమెరికా సెల్ఫ్ డిఫెన్స్ సాకుతో దాడుల‌కు పాల్ప‌డింది. దీంతో శాంతి చ‌ర్చ‌ల‌పై సందేహాలు వ‌స్తున్నాయి. దీని ప్ర‌భావం ఈక్విటీ మార్కెట్ల‌పై భారీగానే ప‌డింది. ఇక బంగారం, వెండి ధ‌ర‌ల్లోనూ తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.44 శాతం పెరిగి 4,528 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 1.37 శాతం పెరిగి 76.5 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 947 పాయింట్లు ప‌త‌న‌మై 1,58,134 వ‌ద్ద ఉంది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 4,584 పాయింట్లు ప‌డిపోయి 2,72,140 వ‌ద్ద నిలిచింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,889 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27, 112 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,58,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,88,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.15,889 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,565 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,520గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,56,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,917 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,336గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,170 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,91,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,95,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,950 గా ఉంది.

Advertisement
Advertisement