త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరిగిన అప్ర‌మ‌త్త‌త‌..

Gold And Silver Prices Today | భౌగోళిక ఉద్రిక్త‌త‌లు త‌గ్గే విష‌య‌మై పెట్టుబ‌డిదారులకు ఇంకా స్ప‌ష్ట‌త క‌నిపించ‌క‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగుతున్నాయి. ఆ ప్రభావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. బంగారం, వెండి ధ‌ర‌ల్లో గ‌త కొద్ది రోజులుగా తీవ్ర హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి.

S

Business | Published On May 23, 2026, 11.10 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల్లో పెరిగిన అప్ర‌మ‌త్త‌త‌..
Advertisement

Gold And Silver Prices Today | భౌగోళిక ఉద్రిక్త‌త‌లు త‌గ్గే విష‌య‌మై పెట్టుబ‌డిదారులకు ఇంకా స్ప‌ష్ట‌త క‌నిపించ‌క‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగుతున్నాయి. ఆ ప్రభావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. బంగారం, వెండి ధ‌ర‌ల్లో గ‌త కొద్ది రోజులుగా తీవ్ర హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబ‌డిదారులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సూచీల‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్ప్ బంగారం ధ‌ర క్రితం సెష‌న్ ముగింపులో 0.74 శాతం త‌గ్గి 4,508 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, వెండి ధ‌ర 1.56 శాతం త‌గ్గి 75.47 డాల‌ర్ల వ‌ద్ద ముగిసింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో క్రితం సెష‌న్ ముగింపులో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 927 పాయింట్లు త‌గ్గి 1,58,679 వ‌ద్ద ముగిసింది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,037 పాయింట్లు త‌గ్గి 2,71,846 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా తగ్గగా, క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,906 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27, 248 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,59,060 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,90,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,300 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,580 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,640గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,58,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,929 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,432గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,290 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,92,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,95,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,950 గా ఉంది.

Advertisement
Advertisement