త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలు స్థిరంగా.. పెట్టుబడిదారుల్లో జాగ్రత్త ధోరణి..

Gold And Silver Prices Today | దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్ప మార్పుల‌తో దాదాపు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్‌పై మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావితమైనప్పటికీ, దేశీయంగా విలువైన లోహాల ధరల్లో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించలేదు.

S

Business | Published On May 22, 2026, 11.08 am IST

Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలు స్థిరంగా.. పెట్టుబడిదారుల్లో జాగ్రత్త ధోరణి..
Advertisement

Gold And Silver Prices Today | దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్ప మార్పుల‌తో దాదాపు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్‌పై మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావితమైనప్పటికీ, దేశీయంగా విలువైన లోహాల ధరల్లో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించలేదు. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణిని కొనసాగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు, సీజనల్ జ్యువెలరీ డిమాండ్‌పై ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు, పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రిటైల్ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుండటంతో ధరల్లో భారీ పతనం చోటుచేసుకోవడం లేదు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధ‌ర 0.29 శాతం త‌గ్గి 4,529 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.04 శాతం త‌గ్గి 76 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 393 పాయింట్లు త‌గ్గి 1,59,213 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 683 పాయింట్లు త‌గ్గి 2,74,100 వ‌ద్ద ఉంది. దేశ‌య స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,949 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27, 592 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,59,490 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,94,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,400 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,620 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,960గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,46,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,62,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,962 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,696గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,620 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,96,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,95,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,950 గా ఉంది.

Advertisement
Advertisement