ChatGPT | చాట్‌జీపీటీలో కొత్త ఫైనాన్స్ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్లు కనెక్ట్ చేసుకునే అవకాశం..
ChatGPT | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఓపెన్‌ఏఐ తన ఏఐ మోడల్ చాట్‌జీపీటీలో కొత్త పర్సనల్ ఫైనాన్స్ అనుభవాన్ని ప్రివ్యూ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వివిధ ఫైనాన్స్ అకౌంట్లను చాట్‌జీపీటీతో కనెక్ట్ చేసుకోవచ్చు.
Technology | Published On May 22, 2026, 12.03 pm IST
ChatGPT | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఓపెన్‌ఏఐ తన ఏఐ మోడల్ చాట్‌జీపీటీలో కొత్త పర్సనల్ ఫైనాన్స్ అనుభవాన్ని ప్రివ్యూ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వివిధ ఫైనాన్స్ అకౌంట్లను చాట్‌జీపీటీతో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలకు కాంటెక్స్ట్ ఆధారంగా సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త అనుభవంలో ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌ను కూడా చేర్చారు. ఇందులో వినియోగదారుల ఖర్చులు, పొదుపులు, ఇన్వెస్ట్‌మెంట్లు, మార్ట్‌గేజ్ వివరాలు విజువల్ రూపంలో కనిపిస్తాయి. వినియోగదారుల డేటాపై పూర్తి నియంత్రణ వారిదేనని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు. వాస్తవ జీవిత వినియోగ పద్ధతులను అర్థం చేసుకున్న తర్వాత అమెరికాలోని అందరు ప్రో సబ్‌స్క్రైబర్లకు విస్తరించనున్నారు. ఇప్పటికే 20 కోట్లకుపైగా వినియోగదారులు బడ్జెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారని కంపెనీ వెల్లడించింది.
చాట్ జీపీటీలో ఫైనాన్షియల్ అకౌంట్ల యాక్సెస్..
ఈ ఫీచర్‌లో భాగంగా చాట్‌జీపీటీ వినియోగదారుల ఫైనాన్షియల్ అకౌంట్లను యాక్సెస్ చేసి సంబంధిత డేటాను ఉపయోగిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలను కూడా అడగవచ్చు. ప్రతి సెషన్‌లో మళ్లీ మళ్లీ తమ ఫైనాన్షియల్ వివరాలు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం వెబ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో 12వేలకుపైగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లకు చాట్‌జీపీటీ సపోర్ట్ ఇస్తోంది. ప్రారంభ దశలో సెక్యూర్ అకౌంట్ లింకింగ్‌ను ప్లెయిడ్ ద్వారా అందిస్తున్నారు. త్వరలో ఇంట్యూట్ సపోర్ట్‌ను కూడా అందించనున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. అర్హత కలిగిన వినియోగదారులు చాట్‌జీపీటీ సైడ్‌బార్‌లో ఫైనాన్సెస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేస్తే అకౌంట్లను కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా చాట్ సెషన్‌లో @Finances, connect my accounts అని టైప్ చేసినా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అన్ని వివరాలు డ్యాష్ బోర్డులోనే..
అకౌంట్లు కనెక్ట్ చేసిన తర్వాత రియల్ టైమ్ ఖర్చులు, రాబోయే చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో, సబ్‌స్క్రిప్షన్ వివరాలను డ్యాష్‌బోర్డ్‌లో చూడవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ ఆమోద అవకాశాలు తెలుసుకోవడం, ట్యాక్స్ అంచనాలు పొందడం, ఇంట్యూట్ ఆధారిత లోకల్ ట్యాక్స్ ఎక్స్‌పర్ట్‌తో సెషన్ బుక్ చేసుకోవడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. భద్రత, గోప్యత విషయంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఓపెన్‌ఏఐ పేర్కొంది. ఎప్పుడైనా ఫైనాన్షియల్ అకౌంట్లను డిస్కనెక్ట్ చేయవచ్చు. సింక్ చేసిన అకౌంట్ డేటాను 30 రోజుల్లో తమ సిస్టమ్‌ల నుంచి తొలగిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే చాట్ హిస్టరీలోని ఫైనాన్షియల్ సమాచారాన్ని వినియోగదారులు తొలగించుకోవచ్చు. ఫైనాన్షియల్ మెమరీని కూడా వీక్షించడం లేదా డిలీట్ చేయడం సాధ్యమవుతుంది. కనెక్ట్ చేసిన ఫైనాన్షియల్ అకౌంట్లతో జరిగే సంభాషణలు జీపీటీ-5.5 థింకింగ్ మోడల్ ఆధారంగా పనిచేస్తాయని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

ChatGPT Images 2.0 | భారత్‌లో చాట్‌జీపీటీ ఇమేజ్ క్రేజ్.. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ఇమేజ్‌ల జనరేషన్..
మే 18, 2026

Token 26 AI Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కార్స్24 బంపర్ ఆఫర్.. రూ.20 లక్షలు గెలుచుకునే అవకాశం..
మే 18, 2026

Credit Cards | క్రెడిట్ కార్డులను ఇలా వాడితేనే లాభం.. లేదంటే అప్పుల భారం..
మే 16, 2026
తాజావార్తలు
- ●realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Oven | ఓవెన్ వాడకంలో ఈ 5 తప్పులు చేస్తే వంటలు పాడవుతాయి.. ఈ సూచనలు పాటించండి..
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..
- ●Tiger attacked | బీడీ ఆకులు ఏరుకునే మహిళలపై పులి పంజా.. నలుగురు మృతి
- ●KTR | ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ తోడు దొంగలే.. నిందితుడిని కాపాడిన వెధవ ఎవరు..? : కేటీఆర్
- ●Govindaraja Swamy Temple | తిరుమల శ్రీవారి అన్న ఎవరో తెలుసా..? గోవిందరాజస్వామి ఆలయ విశిష్టత ఇదే..!

realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Oven | ఓవెన్ వాడకంలో ఈ 5 తప్పులు చేస్తే వంటలు పాడవుతాయి.. ఈ సూచనలు పాటించండి..

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..

Tiger attacked | బీడీ ఆకులు ఏరుకునే మహిళలపై పులి పంజా.. నలుగురు మృతి



