త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA 2026 | నెదర్లాండ్స్‌ షూటౌట్‌!

FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026లో పెనాల్టీ షూటౌట్‌లో మరోసారి నెదర్లాండ్స్ విఫలమైంది. ఆఫ్రికా దిగ్గజం మొరాకో చేతిలో పరాజయం మాజీ చాంపియన్స్ పరాజయం పాలైంది. పెనాల్టీల్లో మూడు కిక్స్ విఫలమవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ కప్ చరిత్రలో పెనాల్టీల్లో ఇది నెదర్లాండ్స్‌కు నాలుగో ఓటమి కావడం గమనార్హం.

P

Sports | Published On Jun 30, 2026, 11.52 am IST

FIFA 2026 | నెదర్లాండ్స్‌ షూటౌట్‌!
Advertisement
  • మొరాకో చేతిలో పరాజయం
  • మళ్లీ విఫలమైన డచ్‌ జట్టు
  • రౌండ్‌ ఆఫ్‌ 16కి చేరిన మొరాకో
  • ఇంటిబాట పట్టిన నెదర్లాండ్స్‌

FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026లో పెనాల్టీ షూటౌట్‌లో మరోసారి నెదర్లాండ్స్ విఫలమైంది. ఆఫ్రికా దిగ్గజం మొరాకో చేతిలో పరాజయం మాజీ చాంపియన్స్ పరాజయం పాలైంది. పెనాల్టీల్లో మూడు కిక్స్ విఫలమవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ కప్ చరిత్రలో పెనాల్టీల్లో ఇది నెదర్లాండ్స్‌కు నాలుగో ఓటమి కావడం గమనార్హం. సుమారు రెండు గంటలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో విజేత తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. నెదర్లాండ్స్ తరఫున జస్టిన్ క్లైవర్ట్, క్వింటెన్ టిమ్బర్, క్రెసెన్సియో సమ్మర్విల్లే పెనాల్టీలను గోల్‌గా మలచడంలో విఫలమయ్యారు. మొరాకో మాత్రం ఒత్తిడిని తట్టుకుని రౌండ్ ఆఫ్ 16కు ప్రవేశించింది.

తోసివేయడంతో ఉద్రిక్తతలు..

మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అనుకున్నట్టుగా దూకుడైన ఆట కాకుండా.. కాస్త ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొరాకో స్ట్రయికర్‌ ఇస్మాయిల్ సైబరీని నెదర్లాండ్స్ డిఫెండర్ జాన్ పాల్ వాన్ హెక్సే తోసివేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 2022 వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్‌ అయిన మొరాకో ఆటగాళ్లలో ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. మొరాకో డిఫెన్స్ తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ ఎటాకింగ్‌ను సమర్థంగా అడ్డుకుంది. డచ్ ఫార్వర్డ్ బ్రియాన్ బ్రోబీకి ఒక్క అవకాశం దక్కలేదు. మరోవైపు క్రెసెన్సియో సమ్మర్విల్లే కొంతసేపు మాత్రమే జట్టును ఆదుకున్నాడు. మొదటి అర్ధభాగంలో మొరాకోకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. డచ్ గోల్‌కీపర్ బార్ట్ వెర్‌బ్రుగెన్ కీలక సేప్‌లతో జట్టును కాపాడాడు. అయూబ్ బౌడ్డి హెడ్డర్‌తో గోల్‌కు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. మొరాకో గోల్‌కీపర్ బోనోను కూడా మిక్కీ వాన్ డె వెన్ దూరం పరీక్షించాడు. అచ్రాఫ్ హకిమీ దూకుడుతో నెదర్లాండ్స్ డిఫెన్స్‌ను ఇబ్బందులకు గురి చేశాడు.

కోడి గాక్‌పో భావోద్వేగం

72వ నిమిషంలో సమయంలో మ్యాచ్‌లో కీలక మలుపు తీసుకుంది. వౌట్ రంగంలోకి దించిన కోచ్ రొనాల్డ్ కోమన్ వ్యూహం ఫలించింది. ఫ్లిక్‌తో సమ్మర్విల్లేకు బంతిని అందించగా.. కోడి గాక్‌పో గోల్‌గా మలిచాడు. గోల్ చేసిన వెంటనే గాక్‌పో భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల తన కుటుంబంలో ఎదురైన వ్యక్తిగత విషాదం నేపథ్యంలో అతను కన్నీటి పర్యంతమయ్యాడు. సహచరులు అతన్ని ఓదార్చారు. ఈ దశలో నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించినా, కెప్టెన్ విర్జిల్ వాన్ డైక్ డిఫెన్స్‌లో కీలకంగా వ్యవహరించాడు. 80వ నిమిషం తర్వాత మొరాకో కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. చివరికి అదనపు సమయంలో చెమ్స్‌డిన్ తాల్బీ ఇచ్చిన అద్భుత క్రాస్‌ను ఇసా డియోప్ హెడ్డర్‌తో గోల్‌గా మలచడంతో స్కోర్‌ సమమైంది.

పెనాల్టీ షూటౌట్ డ్రామా

పెనాల్టీల్లో మొదట నెదర్లాండ్స్ ఆధిక్యం సాధించింది. కానీ, ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. జస్టిన్ క్లైవర్ట్ షాట్ క్రాస్‌బార్‌ను తాకగా.. మొరాకోకు లైఫ్‌లైన్‌ లభించింది. ఆ తర్వాత క్వింటెన్ టిమ్బర్, క్రెసెన్సియో సమ్మర్విల్లేలకు అవకాశం రాగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ చివరి కిక్‌ను గోల్‌గా మలిచి జట్టును రౌండ్ ఆఫ్ 16కి చేర్చాడు. ఇది వరల్డ్ కప్ చరిత్రలో పెనాల్టీల్లో నెదర్లాండ్స్‌కు వచ్చిన నాలుగో పరాజయం. గతంలో 2022 క్వార్టర్ ఫైనల్, 2014 సెమీఫైనల్‌లో అర్జెంటీనాతో, అలాగే 1998లో బ్రెజిల్ చేతిలోనూ పెనాల్టీల్లోనే ఓడిపోవడం గమనార్హం.

Advertisement
Advertisement