త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

NMDC Recruitment | భార‌త ప్ర‌భుత్వ సంస్థ నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (NMDC) స్టీల్ లిమిటెడ్ (NSL) వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌, కెమిక‌ల్‌, మెట‌ల్ల‌ర్జీ, ఫైనాన్స్‌, హెచ్ఆర్‌ విభాగాల్లో 102 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్టుల‌ను భ‌ర్తీ (NMDC Recruitment) చేస్తున్న‌ది.

G

National | Published On Jul 25, 2026, 11.07 am IST

NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..
Advertisement

NMDC Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త ప్ర‌భుత్వ సంస్థ నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (NMDC) స్టీల్ లిమిటెడ్ (NSL) వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌, కెమిక‌ల్‌, మెట‌ల్ల‌ర్జీ, ఫైనాన్స్‌, హెచ్ఆర్‌ విభాగాల్లో 102 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్టుల‌ను భ‌ర్తీ (NMDC Recruitment) చేస్తున్న‌ది. అర్హులైన‌వారు www.nsltd.in వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆరు నెల‌ల‌పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ఆ సమయంలో రూ.50 వేల బేసిక్‌పే తోపాటు అల‌వెన్సులు ఇస్తారు.

మొత్తం ఖాళీలు: 102 పోస్టులు
ఇందులో ఎస్సీ 15, ఎస్టీ 7, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10, జ‌న‌ర‌ల్ 43 చొప్పున ఉన్నాయి.

విభాగాల వారీగా..
సెరామిక్స్ 3, కెమికల్ 4, సివిల్ 3, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 4, ఎలక్ట్రికల్ 22, ఫైనాన్స్ 7, హ్యూమన్‌ రిసోర్సెస్ 3, ఇన్‌స్ట్రుమెంటేషన్ 2, మెకానికల్ 51, మెటలర్జీ 3

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
సెరామిక్స్​ పోస్టులకు.. సెరామిక్​ ఇంజినీరింగ్​లో, ఎలక్ట్రికల్​​​ పోస్టులకు ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ ఇంజినీరింగ్​, కెమికల్​​ పోస్టులకు కెమికల్​ ​ ఇంజినీరింగ్, సివిల్​​ పోస్టులకు సివిల్​​ ఇంజినీరింగ్​లో, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పోస్టులకు కంప్యూటర్ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా ఎంసీఏ, కంప్యూటర్​, సీఎస్​, ఐటీలో బీఈ, బీటెక్​ లేదా కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, సిస్టమ్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టుల‌కు ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​, ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ ఇంజినీరింగ్​, మెకానికల్​ పోస్టులకు మెకానికల్​​​ ఇంజినీరింగ్, మెటలర్జీ​​ పోస్టులకు మెటలర్జీ ​​ ఇంజినీరింగ్​లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఫైనాన్స్​ ఖాళీలకు డిగ్రీ పూర్తి చేయడంతో పాటు సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ చేయాలి. లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌తో ఎంబీఏ (ఫైనాన్స్​) చేసి ఉండాలి.
హెచ్ఆర్‌ పోస్టులకు డిగ్రీ​తో పాటు సోషియాలజీ, సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఐఆర్, ఐఆర్​పీఎం,హెఆర్​, హెఆర్​ఎం లలో కనీసం రెండేండ్ల‌ వ్యవధి గల పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ చేయాలి. అభ్య‌ర్థులు 2026 ఆగస్టు 11 నాటికి 27 ఏండ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్‌ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్​సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 11
వెబ్‌సైట్‌: https://www.nsltd.in/

Advertisement
Advertisement