త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌.. ఆంధ్ర న్యూస్ చానళ్ల‌కు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

RS Praveen Kumar | తెలంగాణలో వివక్షతో విషం చిమ్ముతున్న ఆంధ్ర న్యూస్ చానళ్ల‌కు ప్రధాన రక్షణ కవచాలు సీఎం రేవంత్ (Revanth Reddy), కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు.

G

Telangana | Published On Aug 27, 2026, 10.28 am IST

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌.. ఆంధ్ర న్యూస్ చానళ్ల‌కు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలో వివక్షతో విషం చిమ్ముతున్న ఆంధ్ర న్యూస్ చానళ్ల‌కు ప్రధాన రక్షణ కవచాలు సీఎం రేవంత్ (Revanth Reddy), కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. ఎవరో బలమైన శక్తి ఉంటే తప్ప తెలంగాణలో కొన్ని ఆంధ్ర చానళ్లు (Andhra News Channels) ఇంత బరితెగించవ‌ని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (Rajagopal Reddy)చెబుతున్న‌ద‌ని వంద శాతం నిజ‌మేన‌ని వెల్ల‌డించారు.

రేవంత్ రెడ్డికి బాకా పనులు చేసుకోవచ్చ, కానీ త‌మ‌ జోలికొస్తే ఖబర్దార్ అంటూ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు (ABN Radhakrishna) ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. `సోదరా ఏబీఎన్‌ రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి. లేకుంటే బాగుండదు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది. ఏబీఎన్‌ లాంటి 100 చానళ్లు పెట్టే శక్తి మాకూ ఉంది. మేం అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పుడు ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మా గురించి రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ల‌కు వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్ర మీడియా చానళ్లు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫేక్ స్టోరీలతో మమ్మ‌ల్ని కంట్రోల్ చేయలేరు. ఆంధ్రా మీడియా ఛానెల్ మాకు అవసరం లేదు. ఆంధ్రా మీడియా బోడి సర్టిఫికెట్ మాకు అక్కెర్లేదు` అంటూ రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందిస్తూ.. రాజ‌గోపాల్ రెడ్డి చెబుతున్న‌ది 100 శాతం నిజ‌మ‌ని చెప్పారు.

త‌న‌ను, త‌న పిల్లలను వివక్షతో పబ్లిక్ గా అవమానించిన కేసులో జుబ్లీహిల్స్ పోలీసులు.. ‘ఆంధ్ర’ మహా న్యూస్ (Mahaa News) వంశీని ఇంతవరకు అరెస్టు చేయలేదని చెప్పారు. ఎందుకిలా అంటే కింది స్థాయి పోలీసులు సీఎంఓ ఆదేశాలు అంటున్నారని తెలిపారు. త‌న కేసులో ఫైలును నార్సింగి నుంచి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పంపించడానికే తెలంగాణ పోలీసులు నెల రోజులు తీసుకున్నార‌ని మండిప‌డ్డారు. త‌న‌ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల‌ని పదిసార్లు అడిగితే కానీ ఎస్ఐని పంపలేద‌ని విమ‌ర్శించారు. ఇక చార్జిషీట్ వెయ్యడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారోన‌ని ఎద్దేవా చేశారు. అన్నీ రికార్డ్ అవుతున్నాయని, తరువాత సారీ అంటే కుదరద‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement