Revanth Reddy | మీరాలం చెరువు అభివృద్ధి పనులను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరాలం చెరువు (Meer Alam Cheruvu) వద్ద చేపట్టిన పనులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకస్మికంగా పరిశీలించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరాలం చెరువు (Meer Alam Cheruvu) వద్ద చేపట్టిన పనులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల (Development Works) పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి, దాని చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించారు.

చారిత్రక మీరాలం చెరువుపై రూ.430 కోట్లతో ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జిని (Suspension Bridge) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చింతల్‌మెట్ నుంచి శాస్త్రిపురం వరకు 2.5 కిలోమీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నది. దీంతో చింతల్‌మెట్, శాస్త్రిపురం, అత్తాపూర్, కిషన్‌బాగ్, బహదూర్‌పుర ప్రాంతాల్లోని వాహనదారులకు.. అలానే చింతల్‌మెట్ నుంచి బెంగళూరు ఎన్‌హెచ్ ద్వారా ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది.

భాగ్యనగర వాసుల దాహం తీర్చేందుకు మూడో నిజాం ఈ చెరువును నిర్మించారు. 1804, జూలైలో చెరువు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. రెండేండ్ల వ్యవధిలోనే అంటే 1806లో పనులు పూర్తయ్యాయి. నిజాం సంస్థానంలో దివాన్‌గా పని చేసిన మీర్ ఆలం బహదూర్ పేరును ఈ చెరువుకు పెట్టారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న చెరువు కట్ట నిర్మాణం ప్రజలను ఆకట్టుకుంటుంది. చెరువు మధ్యలో మూడు దీవులుంటాయి. 600 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించగా, ప్రస్తుతం అది 450ఎకరాలకు పరిమితమైంది. 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 27, 2026

MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్
ఆగస్టు 26, 2026

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు.. చమురు ధరలే కీలకం..
- ●Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు.. చమురు ధరలే కీలకం..

Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత



