త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | సొంత ఇంట్లో దొంగ‌త‌నం చేసి.. ప్రేయ‌సికి ఐఫోన్ కొనిచ్చాడు..

iPhone | ప్రేయ‌సితో జ‌ల్సాలు చేసేందుకు ఓ యువ‌కుడు సొంత ఇంట్లో డ‌బ్బు, న‌గ‌లు ఎత్తుకెళ్లాడు. డ‌బ్బుతో ఆ యువ‌తికి ఐఫోన్ (iPhone) కోనివ్వ‌డంతోపాటు ఆమెతో హోట‌ల్‌, రిసార్టుల్లో ఎంజాయ్ చేసిన ఘ‌ట‌న అస్సాంలోని (Assam) జోర్హాట్‌లో జ‌రిగింది.

G

National | Published On Aug 26, 2026, 9.14 am IST

iPhone | సొంత ఇంట్లో దొంగ‌త‌నం చేసి.. ప్రేయ‌సికి ఐఫోన్ కొనిచ్చాడు..
Advertisement

iPhone | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రేయ‌సితో జ‌ల్సాలు చేసేందుకు ఓ యువ‌కుడు సొంత ఇంట్లో డ‌బ్బు, న‌గ‌లు ఎత్తుకెళ్లాడు. డ‌బ్బుతో ఆ యువ‌తికి ఐఫోన్ (iPhone) కోనివ్వ‌డంతోపాటు ఆమెతో హోట‌ల్‌, రిసార్టుల్లో ఎంజాయ్ చేసిన ఘ‌ట‌న అస్సాంలోని (Assam) జోర్హాట్‌లో జ‌రిగింది.

జోర్హాట్‌కు (Jorhat) చెందిన య‌శ్ ధ‌నూకా అగ‌ర్వాల్ (25) త‌న స్నేహితులు జితేంద్ర‌ సోమాని, రోహిత్ ప్ర‌సాద్‌తో క‌లిసి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 11న త‌మ ఇంట్లో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో తండ్రి గ‌దిలోని లాక‌ర్‌ను (Locker) ప‌గుల‌గొట్టాడు. అందులో ఉన్న న‌గ‌దుతోపాటు బంగారు ఆభ‌ర‌ణాలు ఎత్తుకెళ్లాడు. అనంత‌రం త‌న ప్రియురాలు పబాలి దత్తాతో క‌లిసి గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు (Ahmedabad) వెళ్లాడు. ఆమెకు రూ.1.50 ల‌క్ష‌లతో ఐఫోన్ కొనిచ్చాడు. రిసార్టులు, హోట‌ళ్ల‌లో ఇద్ద‌రు క‌లిసి గ‌డిపారు. ఆమెకోసం పెద్ద మొత్తంలో డ‌బ్బును ఖ‌ర్చుపెట్టాడు.

కాగా, లాక‌ర్‌లో డ‌బ్బు, న‌గ‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబ‌ర్‌సెల్ విభాగంతో క‌లిసి పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇది ఇంటిదొంగ‌లు చేసిన ప‌నేన‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలో య‌శ్ అగార్వాల్ క‌నిపించ‌కుండా పోవ‌డంతో అత‌నిపై అనుమానం వ‌చ్చింది. దీంతో అత‌ని సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేయ‌గా గుజ‌రాత్‌లోని (Gujarat) అహ్మ‌దాబాద్‌లో ఉన్న‌ట్లు గుర్తించారు. అహ్మ‌దాబాద్ వెళ్లిన య‌శ్ తండ్రి అత‌డిని ప‌ట్టుకొచ్చి పోలీసుల‌కు అప్ప‌గించారు. దీంతో నిందితుడిని విచారించ‌గా..

సోమాని, రోహిత్ స‌ల‌హాతోనే ఈ ప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డించాడు. దొంగిలించిన డ‌బ్బులో ఎక్కువ మొత్తం ప్రియురాలికోసం (Girlfriend) ఖ‌ర్చు చేశాన‌ని, ఆమెకు ఐఫోన్ కొనిచ్చాన‌ని చెప్పాడు. లాక‌ర్‌ను ప‌గ‌ల‌గొట్టేందుకు తాళాలు తీసే వ్య‌క్తి స‌హాయం తీసుకున్న‌ట్లు తెలిపాడు. సోమాని, రోహిత్ పేర్ల‌ను ఎఫ్ఐఆర్‌లో చేర్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి ప్రియురాలిని విచారిస్తామ‌ని తెలిపారు. కాగా, ఆ డ‌బ్బును వ్యాపారం కోసం ఇంట్లో పెట్టిన‌ట్లు కుటుంబ స‌భ్యులు వెళ్ల‌డించారు. ఆ డ‌బ్బు గురించి నిందితుడికి కూడా తెలుసున‌ని చెప్పారు.

Advertisement
Advertisement