త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్‌.. ప‌లు రైళ్లు ర‌ద్దు.. దారి మ‌ళ్లింపు

Cyclone MURASU Effect | మురాసు తుపాను ప్రభావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప‌లు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండు రైళ్లను రద్దు చేయడంతోపాటు ఐదు రైళ్లను దారి మళ్లించింది. మరో నాలుగు రైళ్లను 120 నిమిషాలు (రెండు గంటలు) ఆలస్యంగా నడపనున్నట్లు ప్రకటించింది.

P

Telangana | Published On Nov 3, 2026, 5.34 pm IST

Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్‌.. ప‌లు రైళ్లు ర‌ద్దు.. దారి మ‌ళ్లింపు
Advertisement

Cyclone MURASU Effect | మురాసు తుపాను ప్రభావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప‌లు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండు రైళ్లను రద్దు చేయడంతోపాటు ఐదు రైళ్లను దారి మళ్లించింది. మరో నాలుగు రైళ్లను 120 నిమిషాలు (రెండు గంటలు) ఆలస్యంగా నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నవంబర్‌ 3న దక్షిణ మధ్య రైల్వే ప్రెస్‌ ప్రకటన విడుదల చేసింది. తుపాను ప్రభావంతో మంగ‌ళ‌వారం న‌డ‌వాల్సిన గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలు, సికింద్రాబాద్‌–గూడూరు (12710) రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఐదు రైళ్లు దారి మ‌ళ్లింపు..

తుపాను కారణంగా ఐదు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. దీంతో ఆయా రైళ్ల మార్గాల్లోని కొన్ని స్టేషన్లలో హాల్టింగ్ ఉండ‌ద‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స్ప‌ష్టం చేసింది. రైలు నంబర్‌ 20626 (భగత్‌ కోఠి–చెన్నై సెంట్రల్‌) నవంబర్‌ 2న ప్రారంభ‌మైన ఈ రైలును కాజీపేట–చర్లపల్లి–కాచిగూడ–ధోన్‌–గూటీ–కడప–రేణిగుంట–కాట్పాడి మీదుగా దారి మ‌ళ్లించామ‌ని.. వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సుల్లూరుపేట స్టేషన్లలో రైలు ఆగ‌ద‌ని పేర్కొంది. అలాగే, రైలు నంబర్‌ 17405 (తిరుపతి–ఆదిలాబాద్‌) మ‌ధ్య న‌డిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రేణిగుంట–గూటీ–గుంతకల్‌–రాయచూరు–సులేహళ్లి–వికారాబాద్‌–సికింద్రాబాద్‌–బొల్లారం మార్గంలో మళ్లించారు. రేణిగుంట–బొల్లారం మధ్య ఉన్న స్టాపేజీలు ఉండ‌వ‌ని చెప్పింది. ఇక రైలు నంబర్‌ 16093 (చెన్నై సెంట్రల్‌–లక్నో) రైలును రేణిగుంట–గూటీ–గుంతకల్‌–రాయచూరు–సులేహళ్లి–వికారాబాద్‌–సికింద్రాబాద్‌–కాజీపేట–బలార్షా మీదుగా మళ్లిస్తున్న‌ట్లు తెలిపింది. గూడూరు–జమ్మికుంట మధ్య స్టాపేజీలు ర‌ద్ద‌య్యాయ‌ని పేర్కొంది. రైలు నంబర్‌ 12651 (మదురై–నిజాముద్దీన్‌) రైలును చెన్నై ఎగ్మోర్‌–రేణిగుంట–గూటీ–ధోన్‌–కాచిగూడ–కాజీపేట–బలార్షా మార్గంలో దారి మళ్లించారు. చెన్నై ఎగ్మోర్‌–బలార్షా మధ్య ఉన్న స్టాపేజీలు ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొంది. రైలు నంబర్‌ 12390 (చెన్నై సెంట్రల్‌–గయా) రైలును చెన్నై సెంట్రల్‌–రేణిగుంట–గూటీ–డోన్‌–కాచిగూడ–కాజీపేట–బలార్షా మార్గంలో దారి మళ్లించారు. చెన్నై ఎగ్మోర్‌–బలార్షా మధ్య స్టాప్స్ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది.

నాలుగు రైళ్లు ఆల‌స్యంగా..

మరో నాలుగు రైళ్లను 120 నిమిషాలు ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి–సికింద్రాబాద్ (12763), చెన్నై సెంట్రల్‌–జోధ్‌పూర్ (04816), చెన్నై సెంట్రల్‌–జైపూర్ (12967), తాంబరం–హైదరాబాద్ (12759) రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తాయ‌ని తెలిపింది. ఈ నాలుగు రైళ్లను నిర్ణీత సమయం కంటే 120 నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్‌ చేశారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ రైళ్ల తాజా సమాచారం తెలుసుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని రైల్వే అధికారులు సూచించారు.

ట్యాగ్స్:

Andhra PradeshCancelled TrainsCyclone MurasuDiverted TrainsHyderabadIndian RailwaysSCR Train UpdatesSouth Central RailwayTelanganaTelugu NewsTrain CancellationTrain DiversionTrain Rescheduling
Advertisement
Advertisement