Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
Indiramma Illu | హైదరాబాద్‌లో సొంతంగా ఇండ్లు నిర్మించుకోడానికి భూములు కలిగి ఉండి అర్హులైన వారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్లకు మరిన్ని భూములను గుర్తిస్తున్నాం
ఈ-లాటరీ ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 1920 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక
14 నియోజకవర్గాల్లో ఖాళీల భర్తీకి బుధవారం మరోసారి లాటరీ
హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
Indiramma Illu | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో సొంతంగా ఇండ్లు నిర్మించుకోడానికి భూములు కలిగి ఉండి అర్హులైన వారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5500 ఇండ్లను మంజూరు చేసిందని, అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో స్థలాల లభ్యత తక్కువగా ఉన్నందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను పేదల నివాసాల కోసం వినియోగిస్తూ ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.
గోషామహల్, ముషీరాబాద్, ఎల్.బి.నగర్, చాంద్రయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కేటాయింపు లాటరీని మంగళవారం ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ-లాటరీ విధానంలో ఈ నియోజకవర్గాల్లో నిర్మించనున్న 1920 ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ రోజు లాటరీ తీసిన ప్రాంతాల్లో ఇండ్లనిర్మాణ పనులకు త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామన్నారు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఆర్టీసీ భూములను కూడా ఇచ్చామని అలాగే పోలీసు శాఖకు చెందిన భూములను సైతం వినియోగిస్తున్నామన్నారు. మొత్తం లక్ష ఇండ్ల నిర్మాణాలను చేపట్టేందుకు అనువైన భూములన్నిటినీ కూడా సేకరిస్తున్నామని ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వచ్చే బోనాల నాటికల్లా గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు ఆ నియోజకవర్గంలోనే సొంతింటి వసతి కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం చాలా మంచిదన్నారు. నియోజకవర్గంలో ఇంకా అనేక చోట్ల గృహనిర్మాణాలకు అనువైన భూములను గుర్తిస్తున్నామని ఉన్నాయని వాటిలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికి సొంతింటి వసతిని కల్పించేంతవరకు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణాలను నిరంతరం చేపడతామని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ఇండ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులను కూడా భాగస్వామ్యులను చేసి, వారి పర్యవేక్షణలో నిర్మాణపు పనులు పూర్తి కావాలన్న ఉద్దేశ్యోంతోనే నామమాత్రంగా ఆరు లక్షల రూపాయల ధరను నిర్ధారించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో 40-50 లక్షల విలువ చేసే ఇంటిని నామమాత్రపు ధరకే అందించడమే కాకుండా, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయాలని నిర్ణయించామన్నారు. ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఈ-లాటరీ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ఈ లాటరీలో ఎంపికైన వారికి వెనువెంటనే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం చేరే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.
బుధవారం మాప్ అప్ లాటరీ
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు పూర్తి అయిన 16 నియోజకవర్గాల్లో, క్షేత్ర స్థాయి పర్యటనల్లోనూ, ఇతర కారణాల్లోనూ రద్దు అయిన ఇండ్లను మాప్ అప్ లాటరీ ద్వారా లబ్ధిదారులకు నవంబర్ 4న (బుధవారం ) చేపట్టనున్నారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఇండ్లను కేటాయించగా, వాటిలో 14 నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో సుమారు 1700 ఇండ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారి జాబితాలోని పేర్ల తోటే ఈ-లాటరీ నిర్వహిస్తున్నారు. ఈ-లాటరీ ప్రక్రియను https://youtube.com/@tghd.official యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
- ●Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్రత్త - "రామాయణ" పైరసీపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- ●Nitin Gadkari EV Charging Tariff | రూ.600 ఖర్చుతో 1,000 కి.మీ జర్నీ.. ఈవీ ఛార్జింగ్‌పై నితిన్ గడ్కరీ సంచలన ప్రతిపాదన
- ●Pocso Court | చంటి బిడ్డతో పోక్సో కోర్టుకు.. తల్లిలా లాలించిన మహిళా కానిస్టేబుల్
- ●ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపండి..

Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్రత్త - "రామాయణ" పైరసీపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

Nitin Gadkari EV Charging Tariff | రూ.600 ఖర్చుతో 1,000 కి.మీ జర్నీ.. ఈవీ ఛార్జింగ్‌పై నితిన్ గడ్కరీ సంచలన ప్రతిపాదన

Pocso Court | చంటి బిడ్డతో పోక్సో కోర్టుకు.. తల్లిలా లాలించిన మహిళా కానిస్టేబుల్





