Flex By Google Pay | యాక్సిస్ బ్యాంకుతో కలిసి సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన గూగుల్ పే.. అప్లై చేసిన వెంటనే కార్డు..
Flex By Google Pay | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే గూగుల్ పే పేరిట భారత్ లో యూపీఐ సేవలను అందిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం అయిన గూగుల్ పే ఓ నూతన క్రెడిట్ కార్డును భారత వినియోగదారుల కోసం ఆవిష్కరించింది. గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేరిట ఈ కార్డును లాంచ్ చేశారు. ఈ కార్డు పూర్తిగా రూపే నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని ఉపయోగించి యూపీఐ విధానంలోనూ పేమెంట్లు చేయవచ్చు. ఈ కార్డును ఫ్లెక్స్ బై గూగుల్ పే పేరిట కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్డు ద్వారా గూగుల్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు సెక్టార్ లోకి సైతం అడుగు పెట్టినట్లు అయింది.
ఇక ఈ కార్డును ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు లేకుండానే అప్లై చేసి పొందవచ్చు. దీన్ని ఫిజికల్‌గా కాకుండా పూర్తిగా డిజిటల్ రూపంలో ఫోన్ ద్వారా వాడుకోవచ్చు. గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను వినియోగదారులు నేరుగా గూగుల్ పే యాప్‌లో అప్లై చేయవచ్చు. అందులోనే కార్డును మేనేజ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ కార్డును పొందేందుకు డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లను సమర్పిస్తే చాల, ఫిజికల్ కాపీలను ఇవ్వాల్సిన పనిలేదు. అలాగే కార్డు కోసం అప్లై చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. పూర్తిగా ఆన్‌లైన్‌లో డిజిటల్ రూపంలో కార్డు ప్రాసెస్ పూర్తవుతుంది. అనంతరం కార్డు కస్టమర్‌కు చెందిన గూగుల్ పే యాప్‌లో యాక్టివేట్ అయి కనిపిస్తుంది. ఆ తరువాత కార్డును వెంటనే వాడుకోవచ్చు. ఫిజికల్ కార్డు కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఈ క్రమంలో కార్డును అప్లై చేశాక కార్డు అప్రూవ్ అయ్యే వరకు పూర్తి ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే జరుగుతుందని, కనుక వినియోగదారులు కార్డులను అప్లై చేసిన వెంటనే పొందవచ్చని తెలిపారు.
కాగా ఈ కార్డు రూపే నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది కనుక దీన్ని యూపీఐ మాదిరిగా స్కాన్ అండ్ పే సదుపాయంతో ఉపయోగించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారులు, యాప్స్‌లో యూపీఐ అందుబాటులో ఉండే చోట ఈ కార్డు ద్వారా పేమెంట్లు చేయవచ్చు. అందుకు గాను సింపుల్‌గా గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేసి ఈ కార్డును ఎంచుకుని అనంతరం పేమెంట్ కోసం స్కానింగ్ చేస్తే చాలు, దాంతో సులభంగా నగదు చెల్లింపులు చేయవచ్చు. ఈ కార్డును వాడేవారికి రివార్డులను కూడా అందివ్వనున్నారు. ఒక రూపాయి ట్రాన్సాక్షన్‌కు ఒక స్టార్ లభిస్తుంది. అలా స్టార్స్ అన్నీ జమ అయ్యాక వాటిని రివార్డ్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఇక ఈ కార్డును యూజర్లు పూర్తిగా గూగుల్ పే యాప్‌లోనే మేనేజ్ చేసుకోవచ్చు. అందులోనే బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇక అవసరం అయిన ట్రాన్సాక్షన్లను ఈఎంఐలోకి కూడా మార్చుకోవచ్చు. అలాగే కార్డును బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేయడం, పిన్ రీజెట్ చేయడం వంటి సదుపాయాలను కూడా గూగుల్ పేలో పొందవచ్చు.
ఈ కార్డును ప్రస్తుతం గూగుల్ పే యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. గూగుల్ పేలో ఉన్న మనీ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తే ఈ కార్డు కోసం అప్లై లింక్ దర్శనమిస్తుంది. వినియోగదారులు అందులో తమ వివరాలను నమోదు చేసి కార్డుకు అప్లై చేయవచ్చు. ప్రొఫైల్ సరిగ్గా ఉంటే కార్డు కొన్ని నిమిషాల్లోనే అప్రూవ్ అవుతుంది. ఆ తరువాత వెంటనే కార్డు యాప్‌లో కనిపిస్తుంది. దీంతో కార్డును వెంటనే ఉపయోగించుకోవచ్చు కూడా. ఈ విధంగా తమ ఫ్లెక్స్ బై గూగుల్ పే క్రెడిట్ కార్డు పనిచేస్తుందని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






