Bank Strike | బ్యాంకులకు 5 రోజుల పని విధానం కోసం సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె
Bank Strike | యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడంతోపాటు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ని సమీక్షించాలనే డిమాండ్లతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు కోరుతున్నాయి.
Bank Strike | యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడంతోపాటు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ని సమీక్షించాలనే డిమాండ్లతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు కోరుతున్నాయి. యూఎఫ్‌బీయూ పరిధిలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్‌సీబీఈ), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ) వంటి ప్రధాన బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని యూఎఫ్‌బీయూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
2024 ప్రతిపాదన పెండింగ్..
ఆగస్టు చివర్లో విడుదల చేసిన ప్రకటనలో యూఎఫ్‌బీయూ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకు యాజమాన్యాల సూచన మేరకు వారంలోని ఇతర రోజుల్లో అదనపు పని సమయాన్ని సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం 2024లో తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అలాగే, 2020లో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయలేదని యూనియన్ ఆరోపించింది. బ్యాంకు మొత్తం పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ఐదు రోజుల వేతనం నుంచి 15 రోజుల వేతనం వరకు సమాన ప్రోత్సాహకాలు అందించే విధంగా ఆ ఒప్పందం ఉందని పేర్కొంది. అయితే ప్రభుత్వం వ్యక్తిగత పనితీరు ఆధారంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని, దీనివల్ల బ్యాంకు ఉద్యోగుల్లో విభజన ఏర్పడుతుందని యూఎఫ్‌బీయూ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది మొదటి సమ్మె..
సెప్టెంబర్ 11న చేపట్టనున్న సమ్మె వరుస దేశవ్యాప్త సమ్మెల్లో మొదటిదని యూఎఫ్‌బీయూ వెల్లడించింది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు కూడా బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లకు పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక దేశవ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించాయి. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహక చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన లేఖ ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్కేల్ 4 నుంచి స్కేల్ 8 వరకు ఉన్న అధికారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పీఎల్ఐ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయనున్నారు.
బ్యాంకులపై పడనున్న ఆర్థిక భారం..
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారుల భవిష్యత్ వేతన సవరణలు, సేవా నిబంధనలకు సంబంధించిన 13వ ద్వైపాక్షిక ఒప్పందం, 10వ సంయుక్త నోట్ చర్చల్లో ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. అయితే పీఎల్ఐ చెల్లింపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయం వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం డిమాండ్‌ను పరిష్కరించదని యూఎఫ్‌బీయూ స్పష్టం చేసింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించి, ప్రభుత్వానికి సిఫారసు చేసిన ఐదు రోజుల బ్యాంకింగ్ ప్రతిపాదన ఇంకా కేంద్రం ఆమోదం కోసం పెండింగ్‌లోనే ఉందని యూనియన్ తెలిపింది. పీఎల్ఐ విధానం బ్యాంకు యూనియన్లు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రధాన వివాదాంశంగా మారింది. సవరించిన పీఎల్ఐ విధానం బ్యాంకులపై గణనీయమైన ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని యూఎఫ్‌బీయూ అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాంకు మొత్తం పనితీరుకు అనుసంధానంగా పీఎల్ఐని నిర్ణయించాలని, స్కేల్ 7 వరకు ఉద్యోగులు, అధికారులకు పీఎల్ఐ రోజులను ఒకే విధంగా ఉంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●Samsung India | శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత.. 100 మందికి ఉద్వాసన..
- ●Tata Madhu and Naveen Kumar Reddy | నాంపల్లి కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ: తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
- ●అసెంబ్లీ గేటు నుంచి ఎర్రవల్లి వరకు.. అసెంబ్లీ ఎజెండా ఎలా మారిపోయింది? ప్రజా సమస్యలు కాదు.. నేతల భావోద్వేగాలకే ప్రాధాన్యం!
- ●Singareni | తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా.. 90 శాతం బొగ్గు రాష్ట్రానికే..!
- ●Supreme Court | అర్హత లేనివారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●Chalo Assembly Telangana | రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, సర్వేయర్ల ముట్టడి

Samsung India | శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత.. 100 మందికి ఉద్వాసన..

Tata Madhu and Naveen Kumar Reddy | నాంపల్లి కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ: తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల

అసెంబ్లీ గేటు నుంచి ఎర్రవల్లి వరకు.. అసెంబ్లీ ఎజెండా ఎలా మారిపోయింది? ప్రజా సమస్యలు కాదు.. నేతల భావోద్వేగాలకే ప్రాధాన్యం!

Singareni | తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా.. 90 శాతం బొగ్గు రాష్ట్రానికే..!






