Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు షాక్.. 3 నెలల కనిష్ఠానికి నిఫ్టీ..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రియల్ ఎస్టేట్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కిందకు తీసుకెళ్లింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ 50 సూచీ 0.34 శాతం నష్టపోయి 3 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 30 సూచీ 0.16 శాతం క్షీణించింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రియల్ ఎస్టేట్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కిందకు తీసుకెళ్లింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ 50 సూచీ 0.34 శాతం నష్టపోయి 3 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 30 సూచీ 0.16 శాతం క్షీణించింది. ఉదయం ప్రారంభంలోనే భారీ గ్యాప్ డౌన్ అయిన సూచీలు తరువాత అధిక శాతం వరకు రికవర్ అయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 79 పాయింట్ల నష్టంతో 23,398 వద్ద ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో 74, 781 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు 2.62 శాతం లాభపడి రూ.1,173 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.12 శాతం పెరిగి రూ.708.50 వద్ద స్థిరపడగా, టెక్ మహీంద్రా 0.86 శాతం లాభంతో రూ.1,538.90 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీలో హిండాల్కో ఇండస్ట్రీస్ షేరు 2.81 శాతం పడిపోయి రూ.985.50 వద్ద ముగిసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.66 శాతం నష్టంతో రూ.1,269.30 వద్ద, టాటా స్టీల్ 2.25 శాతం క్షీణించి రూ.182.58 వద్ద ముగిశాయి.
పెరిగిన అమ్మకాల ఒత్తిడి..
సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.02 శాతం లాభపడి రూ.708 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా 1.38 శాతం పెరిగి రూ.1,539.50 వద్ద, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 0.85 శాతం లాభంతో రూ.1,207 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లో నష్టపోయిన ప్రధాన షేర్లలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.73 శాతం తగ్గి రూ.977.80 వద్ద ముగిసింది. టాటా స్టీల్ 1.67 శాతం నష్టపోయి రూ.182.85 వద్ద, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.33 శాతం క్షీణించి రూ.1,258 వద్ద ముగిసింది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 1,540 షేర్లు నష్టపోగా, 1,046 షేర్లు లాభపడ్డాయి. 51 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 2,303 షేర్లు పడిపోగా, 1,740 షేర్లు లాభపడ్డాయి. మరో 192 షేర్లలో మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.33 శాతం పడిపోవడంతో 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. మార్కెట్‌లో ఒడిదుడుకులను సూచించే ఇండియా వీఐఎక్స్ 3.77 శాతం పెరిగి 12.24కి చేరింది. ఇది నెల రోజుల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
బలపడ్డ రూపాయి..
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లోనూ బలహీనత కనిపించింది. డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 0.39 శాతం తగ్గి ఔన్సుకు 4,389.97 డాలర్లకు చేరింది. అక్టోబర్ డెలివరీ క్రూడ్ ఆయిల్ 3.25 శాతం పడిపోయి బ్యారెల్‌కు 99.15 డాలర్లకు చేరగా, నవంబర్ డెలివరీ బ్రెంట్ క్రూడ్ 3.64 శాతం తగ్గి 103.71 డాలర్ల వద్ద ట్రేడైంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 శాతం పెరిగి 95.58గా నమోదైంది. యూరోతో రూపాయి 0.06 శాతం బలపడి 110.77 వద్ద నిలిచింది. డాలర్ ఇండెక్స్ 0.13 శాతం పెరిగి 99.18కి చేరింది.
సంబంధిత వార్తలు

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్..
సెప్టెంబర్ 11, 2026

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
సెప్టెంబర్ 10, 2026

Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి
- ●Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
- ●Vakiti Srihari | బీసీలకు రిజర్వేషన్లు దానం కాదు.. అది మా హక్కు
- ●ఒక ఆలోచన.. మహా విధ్వంసం: 9/11 కుట్రకు పాతికేళ్లు.. సూత్రధారుల విషాద అంతం
- ●Google Gemini | విండోస్ యూజర్లకు గూగుల్ జెమిని.. ఇక డెస్క్‌టాప్‌లోనే ఏఐ అసిస్టెంట్..
- ●Transgenders | కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లు

Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ

Vakiti Srihari | బీసీలకు రిజర్వేషన్లు దానం కాదు.. అది మా హక్కు

ఒక ఆలోచన.. మహా విధ్వంసం: 9/11 కుట్రకు పాతికేళ్లు.. సూత్రధారుల విషాద అంతం



