UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్
UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న మొత్తంలో ఫీజు విధించడం వల్ల యూపీఐ లావాదేవీల పరిమాణంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న మొత్తంలో ఫీజు విధించడం వల్ల యూపీఐ లావాదేవీల పరిమాణంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎండీఆర్‌కు సంబంధించిన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని, ప్రస్తుతం లావాదేవీల పరిమాణంలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదని తెలిపారు. చిన్న మొత్తంలో ఫీజు విధించడం వల్ల యూపీఐ లావాదేవీలపై ప్రభావం ఉంటుందని తాను వ్యక్తిగతంగా భావించడం లేదని సంజయ్ మల్హోత్రా తెలిపారు.
తగ్గిన లావాదేవీలు..
యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త చెల్లింపు విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా రూ.2వేలకు మించిన ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించనుంది. అయితే ఈ ఛార్జీని అర్హత కలిగిన వ్యాపారులే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. అధిక విలువ కలిగిన కొనుగోళ్లపై ఈ ఫీజు గరిష్ఠంగా రూ.300కు పరిమితం కానుంది. సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు చెల్లింపు భారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.2వేలలోపు రోజువారీ యూపీఐ చెల్లింపులు, అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే బదిలీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగనున్నాయి. అయితే కొత్త యూపీఐ ఎండీఆర్ విధానం అమల్లోకి రాకముందే సెప్టెంబర్‌లో యూపీఐ కార్యకలాపాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో యూపీఐ ద్వారా 24.07 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఆగస్టులో నమోదైన చారిత్రక గరిష్ఠ స్థాయి 24.51 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఇది 1.8 శాతం తగ్గుదల. ఇదే సమయంలో యూపీఐ ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల విలువ కూడా నెలవారీ ప్రాతిపదికన స్వల్పంగా తగ్గి రూ.29.37 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో ఇది రూ.29.82 లక్షల కోట్లుగా ఉంది.
పెరిగిన రెపో రేటు..
సంజయ్ మల్హోత్రా ఈ వ్యాఖ్యలు చేసిన రోజే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో అస్థిరతను కారణాలుగా పేర్కొన్న ఆర్‌బీఐ, సమీప కాలంలో వడ్డీ రేట్ల కోతకు అవకాశం లేదని స్పష్టం చేసింది. తన విధాన వైఖరిని క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్ గా మార్చింది. కాగా యూపీఐపై విధించే 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీని వినియోగదారులపై మోపకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం వెలువడింది.
పంపిణీ ఇలా..
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలోని వివిధ భాగస్వాముల మధ్య ఈ 0.4 శాతం ఎండీఆర్ పంపిణీ కానుంది. మొత్తం ఛార్జీలో 40 శాతం వినియోగదారుడి బ్యాంకుగా ఉన్న ఇష్యూయింగ్ బ్యాంకుకు, 30 శాతం మర్చంట్ అక్వైరర్‌కు, అంటే వ్యాపారి బ్యాంకు లేదా పేమెంట్ గేట్‌వేకు వెళ్తుంది. మరో 20 శాతం యూపీఐ యాప్ లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌కు, మిగిలిన 10 శాతం చెల్లింపుదారుడి పీఎస్‌పీ బ్యాంకుకు అందుతుంది. ఈ ఎండీఆర్ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి వాటా ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సంబంధిత వార్తలు

RBI Governor | ఎల్‌నినో ఎఫెక్ట్.. రబీ పంటలకు భారీ ముప్పు.. ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడి..
అక్టోబర్ 7, 2026

RBI | ఆర్‌బీఐ కీలక ప్రకటన.. ఫ్లోటింగ్ రేట్ బాండ్‌పై 6.45 శాతం వడ్డీ.. ఎంత వస్తుంది..?
అక్టోబర్ 5, 2026

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్‌బీఐ గవర్నర్
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
- ●vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
- ●Gold Price | ఆర్‌బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..
- ●Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్సైట్కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్
- ●Supreme Court | ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం

Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..

Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?

Gold Price | ఆర్‌బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..



