త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zomato | ఎట‌ర్నెల్ సీఈవో రాజీనామా

Zomato | ఎట‌ర్నెట్ లిమిటెడ్ గ్రూపు (Eternal Limited Group) వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో దీపేంద‌ర్ గోయ‌ల్ (Deepinder Goyal) రాజీనామా చేశారు. ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటో (Zomato) కు ఇది పేరెంట్ కంపెనీ. గ్రూప్ నూత‌న సీఈవోగా అల్బింద‌ర్ దిండ్సా నియ‌మిస్తున్న‌ట్లు గోయ‌ల్ తెలిపారు.

A

Business | Published On Jan 22, 2026, 12.07 pm IST

Zomato | ఎట‌ర్నెల్ సీఈవో రాజీనామా
Advertisement

Zomato | ఎట‌ర్నెట్ లిమిటెడ్ గ్రూపు (Eternal Limited Group) వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో దీపేంద‌ర్ గోయ‌ల్ (Deepinder Goyal) రాజీనామా చేశారు. వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి ఆయ‌న ఆ ప‌ద‌వి నుంచి వైదొల‌గనున్నారు. ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటో (Zomato) కు ఇది పేరెంట్ కంపెనీ. గ‌త 18 ఏళ్లుగా ఆయ‌న కంపెనీకి నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న షేర్ హోల్డ‌ర్ల‌కు లేఖ రాశారు. ఇటీవ‌ల త‌న‌కు కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చాయ‌ని, వాటికి తాను ఆక‌ర్షితుడిని అయ్యాన‌ని, కానీ అవి ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని చెప్పారు. ప‌బ్లిక్ కంపెనీ నియమాల‌కు స‌రిపోనివ‌ని అన్నారు. కంపెనీకి వైస్ చైర్మెన్‌గా ఉండి వ్యూహం, పాల‌సీల‌కు స‌హ‌క‌రిస్తాన‌ని పేర్కొన్నారు.

గ్రూప్ నూత‌న సీఈవోగా అల్బింద‌ర్ దిండ్సా నియ‌మిస్తున్న‌ట్లు గోయ‌ల్ తెలిపారు. అల్బింద‌ర్ ప్ర‌స్తుతం బ్లింకిట్ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పై కంపెనీ రోజువారీ కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ‌, వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణ‌యాలు అల్బింద‌ర్ తీసుకుంటార‌ని వివ‌రించారు. బ్లింకిట్‌ను ఉన్న‌త స్థాయికి తీసుకుపోవ‌డంలో స‌మ‌ర్థ‌వంత‌మైన పాత్ర పోషించిన ఆయ‌న త‌మ గ్రూప్‌ను సైతం మ‌రింత ముందుకు తీసుకుపోతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఈ నిర్ణ‌యంపై నెటిజ‌న్లు వివిధ రకాల అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. గోయ‌ల్ రాజీనామా చేసి త‌న హార్డ్‌వేర్ స్టార్ట‌ప్ కంపెనీ అయిన టెంపుల్ కు పూర్తి స్థాయి స‌మ‌యం కేటాయిస్తార‌ని భావిస్తున్నారు. మ‌రికొంత‌మంది గోయ‌ల్ సీఈవోగా రాజీనామా చేసినా కంపెనీ ఆప‌రేష‌న్లు మార‌వ‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement